Site icon NTV Telugu

Pawan Kalyan: ఈ ‘బ్రో’… స్వాగ్ కి కేరాఫ్ అడ్రెస్ లాంటోడు

Bro

Bro

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని యూత్ కి బాగా దగ్గర చేసింది, ఆయన స్టైల్ అండ్ స్వాగ్. సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ స్వాగ్ ని మైంటైన్ చేసేది పవన్ కళ్యాణ్ మాత్రమే. అందుకే ఆయన సినిమాలని చూసి యూత్ ఫిదా అవుతూ ఉంటారు. కల్ట్ ఫ్యాన్ బేస్ మైంటైన్ చేస్తున్న పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా ‘బ్రో’. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. జులై 28న ఆడియన్స్ ముందుకి రానున్న ‘బ్రో’ మూవీపై మెగా ఫాన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. టాక్ హిట్ అనే మాట బయటకి వస్తే చాలు బాక్సాఫీస్ షేపులు మార్చడానికి పవన్ ఫాన్స్ రెడీగా ఉన్నారు. ఇటీవలే బ్రో మూవీ నుంచి ‘మై డియర్ మార్కండేయ’ సాంగ్ బయటకి వచ్చి ఇన్స్టాంట్ చార్ట్ బస్టర్ అయ్యింది.

థమన్ ఇచ్చిన థంపింగ్ ట్యూన్ క్యాచీగా ఉండడంతో సాంగ్ కి రిపీట్ వాల్యూ వచ్చింది. టాప్ ట్రెండ్ అవుతున్న ఈ సాంగ్ ‘బ్రో’ సినిమా ప్రమోషన్స్ కి మంచి కిక్ ఇచ్చింది. లేటెస్ట్ గా ఈ సాంగ్ మేకింగ్ వీడియోని మేకర్స్ రిలీజ్ చేసారు. ఇందులో పవన్ కళ్యాణ్ స్టైల్ అండ్ స్వాగ్ చూస్తే… ఆ రెండు పవన్ కి ఇన్ బిల్ట్ ఉన్నాయేమో అనిపించకమానదు. క్యాజువల్ గా పవన్ నడుస్తూ కనిపించినా కూడా అందులో ఎంతో స్టైల్ కనిపిస్తోంది. ఆయన కల్ట్ ఫ్యాన్ బేస్ కి ఆ స్వాగ్ అతిపెద్ద కారణం అనే మాటని ‘మై డియర్ మార్కండేయ’ సాంగ్ మేకింగ్ వీడియో ప్రూవ్ చేసింది. మెగా మామా అల్లుళ్ల మధ్య రిలేషన్ కూడా ఈ సాంగ్ లో కనిపించింది. ఇద్దరూ సరదాగా నవ్వుకుంటూ కనిపించారు. పవన్-తేజ్ ల మ్యాజిక్, మాటల మాంత్రికుడి డైలాగ్స్, సముద్రఖని మేకింగ్ వర్కౌట్ అయితే జులై 28న మెగా ఫాన్స్ కి పండగనే.

Exit mobile version