NTV Telugu Site icon

Pawan kalyan : శంకర్ తో సినిమా చేయడానికి సిద్ధం అయిన పవన్..?

Whatsapp Image 2023 06 08 At 10.13.15 Am

Whatsapp Image 2023 06 08 At 10.13.15 Am

దక్షిణాది ఇండస్ట్రీలో రాజమౌళి అంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్న దర్శకుడు శంకర్. ఆయనతో సినిమా చేయాలని ప్రతి స్టార్ హీరోకి కూడా ఉంటుంది.ఇప్పుడే కాదు ఆయన డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన మొదటి సినిమా నుంచి పాన్ ఇండియా స్థాయిలో రికార్డ్స్ క్రియేట్ చేసాడు.ప్రస్తుతం ఆయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ అనే సినిమా ను చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తుంది.. ఈ సినిమాతో పాటు ఆయన కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమా కూడా తెరకెక్కిస్తున్నాడు.. శంకర్ రెండు సినిమాలను ఒకేసారి తెరకెక్కిస్తున్నారని సమాచారం.అయితే గేమ్ ఛేంజర్ సినిమాని ముందుగా పవన్ కళ్యాణ్ తో చేయాలని అనుకున్నారు శంకర్.కానీ దిల్ రాజ్ మాత్రం ఈ సినిమా పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువగా రాంచరణ్ బాగా సూట్ అవుతుందని చేద్దామంటూ ఆ ఆయన మనసు మార్చాడని సమాచారం.అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో శంకర్ మరో కొత్త సినిమా చేయడానికి స్టోరీ రెడీ చేశాడని తెలుస్తుంది.. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ మరియు ఓజీ సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలు పూర్తయిన తర్వాత శంకర్ ప్రాజెక్టు గురించి ఆలోచిస్తాడని సమాచారం.ప్రస్తుతం ఆయన నటించిన ‘ బ్రో ది అవతార్ ‘ సినిమా విడుదలకు రెడీగా ఉందని తెలుస్తుంది.

వచ్చే నెల 28వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో పాటు ఓజీ సినిమా కూడా విడుదల అయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే రామ్ చరణ్, ప్రభాస్ మరియు ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.. ఇక త్వరలోనే పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు కూడా పాన్ ఇండియా స్థాయిలో తమ పేరును పాపులర్ చేసుకోబోతున్నారని సమాచారం.. మహేష్ బాబు రాజమౌళితో చేయనున్న సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఏది ఏమైనా ప్రస్తుతం టాలీవుడ్లో పాన్ ఇండియా హవా బాగా నడుస్తుంది. మన హీరోలంతా దేశమంతటా తమ నటనకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నారు.