Site icon NTV Telugu

Pawan Kalyan: మరో 48 గంటల్లో సోషల్ మీడియాని తాకనున్న పవన్ తుఫాన్

Power Star

Power Star

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే వస్తుంది అంటే మెగా అభిమానుల్లో వచ్చే జోష్, ఏ పండగకి తక్కువ కాదు. ఆన్లైన్ ఆఫ్లైన్ అనే తేడా లేకుండా పవన్ ఫ్యాన్స్ చేసే హంగామా మాములుగా ఉండదు. హీరో బర్త్ డే సెలబ్రేషన్స్ లోనే బెంచ్ మార్క్ ఇవి అనిపించే రేంజులో సంబరాలు చేయడం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి తెలిసినంతగా ఇంకొకరికి తెలియదు. ఎప్పటిలానే ఈ సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ కి గ్రాండ్ సెలబ్రేషన్ కి ఫ్యాన్స్ రెడీ అయ్యారు. మరో 48 గంటల్లో ఈ సెలబ్రేషన్ పీక్ స్టేజ్ కి చేరి సోషల్ మీడియాని కంప్లీట్ గా హ్యాండ్ ఓవర్ చేసుకోనున్నాయి. అభిమానుల హ్యాపినెస్ ని మరింత పెంచుతూ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాల నుంచి అప్డేట్స్ బయటకి రాబోతున్నాయి. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి సినిమాల నుంచి పవన్ బర్త్ డే ట్రీట్ గా పోస్టర్లు, గ్లిమ్ప్స్ లు రిలీజ్ అవుతున్నాయి. క్రిష్ తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు సినిమా నుంచి ఒక పవర్ ఫుల్ పోస్టర్ ని విడుదల చేయనున్నారు.

గతేడాది ఈ మూవీ నుంచి వచ్చిన గ్లిమ్ప్స్ కి సోషల్ మీడియా షేక్ అయ్యింది. ఇప్పుడు క్రిష్ ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తాడో చూడాలి. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఇప్పటికే అదిరిపోయే గ్లిమ్ప్స్ వచ్చింది కాబట్టి ఈసారి వింటేజ్ పవన్ కళ్యాణ్ ని చూపించే పోస్టర్ ని రిలీజ్ చేయనున్నాడు హరీష్ శంకర్. హరిహర వీర మల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల కన్నా పవన్ ఫ్యాన్స్ ని ఎక్కువగా ఊరిస్తుంది OG గ్లిమ్ప్స్. సుజిత్ పవన్ కళ్యాణ్ ల పవర్ ఫుల్ కాంబినేషన్ లో, గ్యాంగ్ స్టర్ డ్రామాగా OG తెరకెక్కుతుంది. ఈ మూవీ గ్లిమ్ప్స్ బయటకి రావడం సోషల్ మీడియా రికార్డ్స్ అన్నీ బ్రేక్ అవ్వడం ఒకేసారి జరుగుతుంది. సో కాస్త అటు ఇటుగా ఈ మూడు సినిమాల అప్డేట్స్ అన్ని ఒకేరోజు బయటికొస్తే ఏది బాగుందనే కంపారిజన్స్ ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి సెప్టెంబర్ 2న సోషల్ మీడియాలో పవన్ వర్సెస్ పవన్‌గా మారుతుందని చెప్పాలి.

Exit mobile version