అభిమానులందు.. ఈ అభిమాని వేరయ.. అనేలా ఉంటుంది బండ్ల గణేష్ అభిమానం. ఎందుకంటే.. ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. అంటూ వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బండ్లన్న ఇచ్చిన స్పీచ్.. పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది. అసలు పవర్ స్టార్, బండ్ల గణేష్ ఈ ఇద్దరి గురించి చర్చ వస్తే.. ముందుగా ఈ స్పీచ్‌నే గుర్తుకు వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. పవన్ అంటే బండ్లన్నకు దైవంతో సమానం. ఒక్కసారి బండ్లన్నకు పవన్ పూనుకుంటే చాలు.. అభిమానులు ఈలలు, గోలతో ఇచ్చే ఎలివేషన్ ఏ రేంజ్‌లో ఉంటుంది. అందుకే.. పవర్ స్టార్ సినిమా ప్రతీ ఈవెంట్‌లో బండ్లన్న కావాల్సిందేనని పట్టుబడుతుంటారు పవన్ ఫ్యాన్స్. కానీ భీమ్లా నాయక్ సినిమా నుంచి పవన్ సినిమా ఈవెంట్లలో కనిపించడం లేదు బండ్లన్న.
భీమ్లా నాయక్ ఈవెంట్ సమయంలో త్రివిక్రమ్ తనని రానివ్వడం లేదని బండ్ల గణేష్ మాట్లాడినట్టుగా ఓ ఆడియో లీక్ అయి వైరల్ అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పవన్ ఈవెంట్లకు దూరమయ్యాడు బండ్లన్న. అంతేకాదు.. త్రివిక్రమ్, బండ్ల గణేష్ ఇద్దరిలో ఒకరుంటే ఒకరు ఈవెంట్లకు రారానే టాక్ కూడా ఉంది. భీమ్లా నాయక్ సినిమాకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు త్రివిక్రమ్. ఇక ఇప్పుడు బ్రో సినిమాకు కూడా త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. అందుకే.. ఈ రోజు జరగనున్న బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బండ్లన్న రాడనే చెప్పాలి. ఈ ఈవెంట్‌కు పవర్ స్టార్‌తో పాటు.. త్రివిక్రమ్ కూడా రానున్నాడు. అయినా కూడా బండ్లన్న లేని వెలితి మాత్రం ఉంటుందని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. అయితే పవర్ స్టార్‌కు గురూజీ ఇచ్చే ఎలివేషన్ కూడా మామూలుగా ఉండదని చెప్పొచ్చు.
