Site icon NTV Telugu

Pawan Kalyan: ఓరీ .. ఇదెక్కడి మాస్ రా మావా

Pawan

Pawan

OG:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇంకోపక్క రాజకీయ ప్రచారాల్లో కూడా బిజీగా మారాడు. త్వరలోనే వారాహి యాత్ర మొదలు కాబోతుండగా.. ఆలోపే సినిమాలు అన్ని ఫినిష్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇక ఇప్పటికే బ్రో సినిమాలో తన పార్ట్ షూట్ ను పూర్తిచేశాడట పవన్. ఇక ఈ సినిమా తరువాత ఉస్తాద్ భగత్ సింగ్ లో అడుగుపెట్టబోతున్నాడు. ఇప్పటికే ఆనంద్ సాయి .. ఉస్తాద్ కోసం భారీ సెట్ ను నిర్మిస్తున్న విషయం కూడా విదితమే. ఇక ఈ రెండు కాకుండా పవన్ నటిస్తున్న మరో చిత్రం OG. సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ మధ్యనే ఈ సినిమా భారీ షెడ్యూల్ ను ముగించిన పవన్.. నేడు మరో షెడ్యూల్ కోసం OG సెట్ లో అడుపగుపెట్టాడు. ఈ సినిమా మొదలుపెట్టిన దగ్గరనుంచి పవన్ సెట్ లో ఉన్న ఫోటోలను కూడా ఎడిట్ చేసి.. ఓ రేంజ్ లో వదులుతున్నారు మేకర్స్.

Vijay Devarakonda: రౌడీ హీరో సరసన బుట్టబొమ్మ.. ముద్దులకు ఈసారి హద్దులే లేవమ్మా..?

ఇక తాజాగా మరో ఫోటోను వదిలారు. వైట్ అండ్ వైట్ డ్రెస్ లో గాగుల్స్ పెట్టుకొని సెట్ లో అడుగుపెడుతున్న ఫోటోను షేర్ చేస్తూ.. ” OG.. సెట్ లో అడుగుపెట్టాడు.. స్టైల్, మాస్ మరియు ఎనర్జీతో కూడిన యాక్షన్-ప్యాక్డ్ షెడ్యూల్ జరుగుతోంది” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఓరీ .. ఇదెక్కడి మాస్ రా మావా .. సెట్ లో అడుగుపెట్టిన ఫొటోలకే ఇంత క్రేజ్ అయితే.. పోస్టర్స్ వస్తే హైప్ తో చచ్చిపోతామేమో అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తోంది. మరి ఇన్ని సినిమాలను పవన్ వారాహి యాత్రకు ముందు పూర్తి చేయగలడా..? లేదా అనేది చూడాలి.

Exit mobile version