Pawan Kalyan Comments on Jr NTR Fans: కృష్ణాజిల్లా గుడివాడ సభలో పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుడివాడ వెళ్లారు. అక్కడ కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థి వెనిగళ్ల రాము తరపున ప్రచారం చేశారు. ఇక ఈ క్రమంలో సభలో పవన్ మాట్లాడుతూ కొడాలి నానిని తిట్టాలని ఏమీ నాకు లేదు, నాకు వ్యక్తిగతంగా ఏ శత్రుత్వం లేదు, వంగవీటి రాధా వివాహంలో కొడాలి నాని కనపడితే కలిశానని అన్నారు. కొడాలి నాని నోరు పారేసుకునే ఎమ్మెల్యే, నాని నోరు కట్టడి చేయాలి అంటే రాముని గెలిపించాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వం దాడులు, దోపిడీ ప్రభుత్వం అని అన్నారు. ఎన్టీఆర్, ఎంజీఆర్ మాదిరిగా రాజకీయాల్లో అందరికీ అవదని, జనసేనను కాపాడటానికి కాదు ఏపీ బాగు కోసం వచ్చానని అన్నారు.
Samantha- Anupama: సమంత – అనుపమ.. కలిసి ఏం చేస్తారు?
రోడ్లు గోతులు.. అడిగితే ఎమ్మెల్యేలు బూతులు తిడుతున్నారని, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కాదు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఒకటి తెచ్చారని అన్నారు. ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టి ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు వైఎస్ఆర్ గా మార్చారని, ఇది సరైన విధానం కాదన్నారు. టీడీపీతో విబేధాలు ఉన్నప్పటికీ చంద్రబాబును జైల్లో పెట్టించటం బాధించిందని కూడా పవన్ అన్నారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే పవన్ మాట్లాడుతుండగా కొందరు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆయన ఫొటోలు చూపించడంతో నాకు ఎన్టీఆర్ ఫొటోలు కనిపిస్తున్నాయని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు, … రంగా గారి అభిమానులు ఫొటోలు చూపిస్తున్నారు. రంగా గారి అభిమానులకి, జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకి, అందరు హీరోల అభిమానులకి ధన్యవాదాలు అని అన్నారు. ఇక భగీరధుడి ఫొటోలు కూడా కనిపిస్తున్నాయి, ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని పోలవరం పూర్తి చేస్తానని ఆయన అన్నారు.