NTV Telugu Site icon

Vishwak Sen : పవన్ క్లాప్ తో విశ్వక్ సేన్ సినిమా ఆరంభం

Vishwak Sen

Vishwak Sen

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్లాప్ తో విశ్వక్ సేన్ కొత్త సినిమా ప్రారంభం అయింది. శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై యాక్షన్ కింగ్ అర్జున్ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. అర్జున్ కుమార్తె ఐశ్వర్య ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది. లీడ్ పెయిర్‌ విశ్వక్, ఐశ్వర్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టగా కె రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు.

 

మా ప్రెసిడెంట్ మంచు విష్ణు స్క్రిప్ట్‌ను అందజేశారు. సురేష్ బాబు, ప్రకాష్ రాజ్, బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ ప్రారంభోత్సవానికి అతిథులుగా హాజరయ్యారు. సాయిమాధవ్ బుర్రా రచన చేస్తున్న ఈ సినిమాకు కేజీఎఫ్ ఫేమ్  రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా బాలమురుగన్ సినిమాటోగ్రఫీ బాధ్యతను నిర్వహించనున్నారు. ఇది నిర్మాతగా తనకు 15 చిత్రమని, దర్శకుడుగా 13వ చిత్రమని చెబుతూ తనను తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం చేసిన కోడిరామకృష్ణను తలచుకున్నారు అర్జున్.

ఇప్పటి వరకూ తనను ఆదరించిన తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా ద్వారా తెలుగులో పరిచయం అవుతున్న తన కుమార్తె ఐశ్వర్యను కూడా ఆదరించాలని కోరారు. టాప్ టెక్నీషియన్స్ తో అందరూ పోటీ పడి ఎవరివారు పై చేయి అనిపించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నామని, తెలుగులో ఇప్పటి వరకూ రానటువంటి కథాంశంతో తీసున్న సినిమా ఇదంటూ త్వరలో టైటిల్ ప్రకటిస్తామని తెలిపారు అర్జున్.

Show comments