పవన్ కళ్యాణ్.. ఈ పేరు వినగానే అభిమానుల్లో ఒక వైబ్రేషన్.. ఆయనకు జయాపజయాలతో సంబంధం ఉండదు. సినిమాలు చేసినా చేయకపోయినా ఆ క్రేజ్ తగ్గదు. పవన్ కు ఉండేది అభిమానులు కాదు భక్తులు. అభిమానులకు ఆయన ఒక హీరో కాదు దేవుడు. ట్విట్టర్ లో పవన్ పెట్టిన ట్వీట్ ఏదైనా సరే నిమిషాల్లో ట్రెండింగ్ లోకి వెళ్ళిపోతుంది. జనసేనానిగా ఆయన ఒక్క మాట మాట్లాడినా అభిమానులు వెర్రెక్కిపోతారు. అయితే తాజాగా పవన్ పేరు ట్విట్టర్ లో ట్రెండింగ్ అవుతోంది. ఈసారి ఆయనేమి మాట్లాడలేదు.. ఫోటో షేర్ చేయలేదు.. మరి ఎందుకు పవన్ పేరు ట్రెండ్ అవుతుందంటే.. పవన్ ట్విట్టర్ ప్రొఫైల్ పిక్ ను చేంజ్ చేశారు.
ఏంటీ.. ప్రొఫైల్ పిక్ చేంజ్ చేస్తేనే ట్రెండింగ్ చేశారా ..? అంటే అలా ఉంటుంది పవన్ అభిమానులతోటి అంటున్నారు ఫ్యాన్స్. అంతకు ముందు పవన్ గుబురు గడ్డంతో బ్లూ కలర్ టీ షర్ట్ తో ఉన్న ఫోటో ఉండేది.. ఇప్పుడు దాన్ని మార్చి లేటెస్ట్ పిక్ ను అప్ లోడ్ చేశారు. ఈ కొత్త ఫోటోలో పవన్ లుక్ అదిరిపోయింది. జనసేనాని ఉగ్ర రూపంతో ఉన్న ఈ ఫోటో ప్రస్తుతం ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మార్చేశారు పవన్ ఫ్యాన్స్.. ఒక ప్రొఫైల్ పిక్ ను ఇంతలా ట్రెండ్ చేయడం ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కే చెల్లింది. ఆ ఘనత కేవలం పవన్ కు మాత్రమే దక్కుతోంది. ఇక ప్రస్తుతం పవన్ హరిహర వీరమల్లు సినిమాను పూర్తిచేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా తరువాత వినోదాయ సీతాం రీమేక్ లో పాల్గొననున్నాడు.
