Site icon NTV Telugu

Pawan Kalyan : ఖరీదైన ప్లాట్ కొన్న పవర్ స్టార్ ?

pawan

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సక్సెస్‌తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ చిత్రాలతో రెండు వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు పవన్. అయితే పవన్ కళ్యాణ్ తాజాగా ఒక ఖరీదైన ప్లాట్ ను కొన్నట్టుగా తాజాగా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పవన్ సాధారణంగా నగరానికి దూరంగా ఉన్న తన ఫామ్‌హౌస్‌లో ఎక్కువగా నివసిస్తారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పవన్ కు పలు ఆస్తులతో పాటు హైదరాబాద్ లో ఒక ఇల్లు ఉండగా, తన రాజకీయ పార్టీ జనసేన కార్యకలాపాల కోసం ఇటీవల కార్యాలయాన్ని కూడా స్థాపించాడు.

Read Also : RRR : మరో కాంట్రవర్సీలో జక్కన్న మూవీ

తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం పవన్ ఇటీవల భారీ మొత్తంలో ఖర్చు చేసి హైదరాబాద్‌లో 1200 చదరపు గజాల పెద్ద ప్లాట్‌ను కొనుగోలు చేశాడు. ఇది ఖాజాగూడ లోని మెయిన్ ఏరియాలో ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడ ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం చూస్తే చదరపు గజానికి 2 లక్షలు విలువ ఉందట. పవన్ కొన్న భూమి మొత్తం వోలివా 24 కోట్ల వరకు ఉండొచ్చని అంచనాలు కూడా వేస్తున్నారు. ఆ ప్రాంతంలో చాలా విద్యా సంస్థలు, గేటెడ్ కమ్యూనిటీలు ఇప్పటికే నిర్మించారని సమాచారం. మరోవైపు పవన్ తమిళంలో ‘వినోదయ సితం’ అనే చిత్రాన్ని రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఆయన హై బడ్జెట్ చిత్రం ‘హరి హర వీర మల్లు’ చాలా కాలంగా నిర్మాణంలో ఉంది. హరీష్ శంకర్‌తో ‘భవదీయుడు భగత్ సింగ్’ని ఓకే చేసి, రామ్ తాళ్లూరి ప్రొడక్షన్‌లో సురేందర్ రెడ్డితో ఒక ప్రాజెక్ట్ కూడా కమిట్ అయ్యాడు.

Exit mobile version