Site icon NTV Telugu

Bro: ‘బ్రో’ రన్ టైమ్ తక్కువయ్యేలా ఉందే…

Bro

Bro

బాక్సాఫీస్ సెన్సేషన్ సృష్టించడానికి, ఓపెనింగ్స్ లో కొత్త రికార్డులని క్రియేట్ చేయడానికి ఈ మంత్ ఎండింగ్‌లో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో కలిసి పవర్ స్టార్ జూలై 28న థియేటర్స్ లోకి ‘బ్రో’గా రాబోతున్నాడు. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్, బ్రో మూవీ సాంగ్స్ ని బ్యాక్ టు బ్యాక్ బయటకి వదులుతూ ఉన్నారు. టీజర్, మై డియర్ మార్కండేయ సాంగ్ ‘బ్రో’ మూవీకి మంచి బజ్ వచ్చేలా చేసాయి కానీ పవర్ స్టార్ సినిమాకి ఉండే జోష్ కనిపించట్లేదు. అది కనిపించాలి అంటే బ్రో మూవీ ప్రమోషన్స్ లో మరింత స్పీడ్ పెరగాలి. అక్కడుంది పవర్ స్టార్ కాబట్టి మెగా ఫాన్స్ సంబరాలు రిలీజ్ రోజున పీక్ స్టేజ్ లో ఉంటాయి. ఆన్ లైన్ ఆఫ్ లైన్ అనే తేడా లేకుండా మెగా ఫాన్స్ హంగామా చేస్తారు. ఇది దృష్టిలో పెట్టుకోని బ్రో సినిమా ప్రమోషన్స్ ని ప్లాన్ చేసుకోవాలి. ప్రీరిలీజ్ ఈవెంట్ నుంచే బ్రో హైప్ పెంచడానికి మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. ఇక్కడి నుంచి జులై 28 వరకూ బ్యాక్ టు బ్యాక్ కంటెంట్ ని రిలీజ్ చేస్తే పాజిటివ్ బజ్ ని క్యారీ చేస్తూ ఉండాలనేది మేకర్స్ ప్లాన్.

ఇది వర్కౌట్ అయితే జులై 28న ఓపెనింగ్ డే రికార్డ్స్ క్రియేట్ అవ్వడం గ్యారెంటీ. ఇదిలా ఉంటే.. బ్రో మూవీ రన్ టైం ఎంత? అనేది తాజాగా బయటకు వచ్చేసింది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. ‘బ్రో’ మూవీ 130 రన్ టైం లాక్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అంటే.. రెండు గంటల పది నిమిషాలతో బ్రో ఆడియెన్స్ ముందుకు రానుంది. స్టార్ హీరోల సినిమా అంటే మినిమమ్ రెండున్నర గంటల నిడివి ఉండేలా చూసుకుంటారు కానీ మరీ రెండు గంటల పది నిమిషాల్లో పవన్ కళ్యాణ్ ని చూడాలి అంటే ఫాన్స్ కాస్త నిరాశ చెందడం గ్యారెంటీ. అది కూడా మల్టీస్టారర్ అంటే ఇంకా ఇబ్బంది కలిగించే విషయం. కనిపించే కాసేపు అయినా పవన్ కి సూపర్బ్ సీన్స్ పడితే ఫాన్స్ నిడివి లోటు తెలియకుండా బయటకి వస్తారు. సినిమా స్టార్ట్ అయిన 20 నిమిషాల తర్వాత పవన్ ఎంట్రీ ఉంటుందట. ఇక్కడి నుంచి బ్రో గ్రాఫ్ ని లిఫ్ట్ చేస్తే చాలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఖాతాలో మరో హిట్ పడినట్లే.

Exit mobile version