Site icon NTV Telugu

Pawan Kalyan: పోరాడితే పోయేదేం లేదురా.. ఎదవ బానిస సంకెళ్లు తప్ప..

Pawan

Pawan

Pawan Kalyan: అభిమానం.. ఆపితే ఆగేది కాదు. ముఖ్యంగా సినిమా హీరోల మీద అభిమానులకు ఉన్న అభిమానం మాములుగా ఉండదు. తమ్ అభిమాన హీరో పుట్టినరోజు వస్తుంది అంటే .. వారికి పండుగ మొదలైనట్లే. ఇక అందులోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే అంటే.. అభిమానులు కాదు భక్తులే.. పండుగ కాదు ఏకంగా జాతరనే చేస్తారు.ఇప్పటికే ఆ జాతర మొదలైపోయింది. పవన్ కళ్యాణ్ బర్త్ డే కార్నివాల్ అంటూ సోషల్ మీడియా ట్రెండ్ సృష్టిస్తున్నారు. పాలాభిషేకాలు.. పూలాభిషేకాలు.. అన్నదానాలు.. రక్తదానాలు.. ఇలా ప్లాన్ చేసేస్తున్నారు. ఇక ఇంకోపక్క అభిమానులు.. పవన్ కొత్త సినిమాల అప్డేట్స్ వస్తాయని ఎదురుచూస్తున్నారు.

Jabardasth Rohini: వాడెవడు.. ఆఫ్ట్రాల్ గాడు.. నా కాలి గోటికి కూడా సరిపోడు..

ఇక తాజాగా పవన్ కళ్యాణ్ సీడీపీ ప్రోమోను రిలీజ్ చేశారు. సీడీపీ అంటే.. కామన్ డిస్ప్లే పిక్. పవన్ పుట్టినరోజున అందరూ ఈ ఫోటోనే షేర్ చేస్తారు. ఎప్పుడు పవన్ ఫొటోతోనే ఉండే సీడీపీకి ఈసారి కొద్దిగా పొలిటికల్ టచ్ ఇచ్చారు. సీడీపీ ప్రోమో వీడియోలో.. జనసేనాని పవన్ నినాదాన్ని వినిపించారు. ఎలుగెత్తు.. ఎదురించు.. ఎన్నుకో అంటూ రాసి ఉంది. ఇక చివరిలో పోరాడితే పోయేదేం లేదురా ఎదవ బానిస సంకెళ్లు తప్ప అనే పవన్ బేస్ వాయిస్ తో చెప్పిన డైలాగ్ గూస్ బంప్స్ ను తెప్పిస్తోంది. ఇక బర్త్ డే సీడీపీ ని ఆగస్టు 27 న పవన్ రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరి సెప్టెంబర్ 2 ఏ రేంజ్ లో ఉండనుండో చూడాలి.

Exit mobile version