మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా ప్రముఖుల విషెస్ తో ట్విట్టర్ హోరెత్తింది. సినీ, రాజకీయ, మిత్రులు చిరుకు బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అన్నయ్య చిరంజీవికి విషెస్ తెలిపారు. ‘చిరంజీవి నాకు మాత్రమే మార్గదర్శకుడు కాదని.. ఎంతో మందికి స్ఫూర్తి అని పవన్ తెలిపారు. మెగా స్టార్ తనకు తండ్రి లాంటి వారని.. కరోనా సమయంలోనూ ఎంతో మంది కార్మికులకు సహాయం చేశారని గుర్తు చేశారు. జనసేన పార్టీ తరఫున ప్రెస్ నోట్ లో పవన్ విషెస్ తెలియజేశారు. కాగా, కాసేపటి క్రితమే.. చిరంజీవి ఇంటికి స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లారు. ఈ సందర్భంగా చిరంజీవికి బర్త్ డే విషెస్ చెప్పారు.
మెగాస్టార్ చిరంజీవి నివాసంలో పవర్ స్టార్
