Site icon NTV Telugu

Pawan Kalyan: అన్నను తిట్టారని.. 18 ఏళ్లకే రౌడీలను చితక్కొట్టిన పవన్..?

Pawan

Pawan

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అన్న చిరంజీవి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తల్లి తండ్రుల తరువాత అన్నావదినలే నన్ను తల్లిదండ్రులుగాపెంచారు అని పవన్ ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. ఇక చిన్నతనం నుంచి పవన్ ఇంట్రోవర్ట్ గా పెరిగాడు. ఎవరితోనూ కలిసేవాడు కాదు.. చదువు కూడా అంతంత మాత్రమే. ఈ విషయాన్నీ పవన్ ఎన్నో వేదికలపై చెప్పాడు. కానీ, అన్నను ఎవరైనా ఏదైనా అంటే మాత్రం అస్సలు ఊరుకొనేవాడు కాదు అంట. ఇందుకు సంబందించిన ఒక స్టోరీ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. చెన్నైలో చిరంజీవి షూటింగ్ చేస్తున్న సమయంలో అక్కడకు కొంతమంది రౌడీలు వచ్చి చిరును ఎగతాళి చేస్తూ మాట్లాడేవారట. షూటింగ్ జరగకుండా వాచ్ మెన్ ను తిట్టడం, కొట్టడం చేసేవారట.

ఇక చిరు మాత్రం మౌనంగా వాటిని భరిస్తూ షూటింగ్ పూర్తిచేసేవాడట. అయితే ఆ రౌడీలు మితిమీరి ప్రవర్తిస్తే.. చిరు కారు డ్రైవర్.. పోలీసులకు ఫిర్యాదు చేద్దామని అనడంతో.. వద్దు.. ఇంకో రెండు గంటలు భరిస్తే షూటింగ్ అయిపోతుంది. ఎందుకు ఇలాంటి గొడవలు అని చెప్పాడట. అయితే చిరును రౌడీలు అనరాని మాటలు అన్నారని తెలుసుకున్న కళ్యాణ్ బాబు.. వెంటనే ఆ రౌడీలు ఉన్న ప్లేస్ కు వెళ్లి వాళ్ళను చితక్కొట్టాడట. ఈ విషయం తెలుసుకున్న చిరు.. కళ్యాణ్ ను మందలించాడట. దీంతో ఉదయమే.. కళ్యాణ్ బాబు.. రౌడీలు అడ్మిట్ అయిన హాస్పిటల్ కు వెళ్లి.. వారికి సారీ చెప్పి వచ్చాడట. అన్నను తిట్టారని.. 18 ఏళ్లకే రౌడీలను చితక్కొట్టాడట పవన్. అన్న అంటే అంత ప్రేమ. ఈ విషయాన్నీ పవన్ జనసేన సభలో కూడా తెలిపాడు. ఇందుకు సంబందించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version