Site icon NTV Telugu

మరోసారి ‘దేవుడు’ పాత్రలో పవన్!

pawan-samudrakhani

pawan-samudrakhani

పవన్ కల్యాణ్ మరోసారి దేవుడి పాత్రలో కనిపించబోతున్నాడట. అభిమానులు పవన్ ను దేవుడిగా భావిస్తుంటారు. వారే కాదు కొంత మంది దర్శకనిర్మాతలు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండటం చూస్తూనే ఉన్నాం. ఇక వెండితెర మీద కూడా పవన్ దేవుడి పాత్రలో అలరించారు. ‘గోపాల గోపాల’ సినిమాలో అభినవ కృష్ణుడిగా అలరించారు పవన్. చేసింది కృష్ణుడి పాత్ర అయినా మనిషి రూపంలోనే కనిపించి కనువిందు చేశాడు. ఆ పాత్రను ప్రేక్షకులు చక్కగా రిసీవ్ చేసుకున్నారు. పవన్ క్రేజ్ వల్లే అది సాధ్యం అయింది. ఇక ఇప్పుడు మరోసారి పవన్ దేవుడిగా వెండితెరపై కనిపించడానికి సిద్ధమవుతున్నట్లు వినిపిస్తోంది.
తెలుగులో విలన్ గా బిజీ అయిన తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని తమిళంలో డైరెక్ట్ చేసిన సినిమా ‘వినోధాయ సిత్తం’. సముద్రఖనితో పాటు తంబి రామయ్య, సంచిత శెట్టి ప్రధాన పాత్రలను పోషించారు.

https://ntvtelugu.com/kollywood-hero-dhanush-direct-telugu-film-anounced/

జీవితం ఆనందంగా సాగిపోతున్న తరుణంలో తంబి రామయ్య హఠాత్తుగా చనిపోతాడు. పరలోకంలో అడుగుపెట్టనా ప్రశాంతంగా లేక పోవడం గమనించి దేవుడు కారణం అడుగుతాడు. తనని మూడు నెలల పాటు బ్రతికిస్తే బాధ్యతలు నెరవేర్చుకుని వచ్చేస్తానని దేవుడిని కోరతాడు తంబిరామయ్య. దానికి దేవుడు అంగీకరిస్తాడు. తిరిగి భూమి మీదకి వచ్చిన తంబి రామయ్యకు ఎదురయ్యే పరిస్థితులు ఏమిటన్నదే ఈ సినిమా కథ. తమిళంలో దేవుడి పాత్రను సముద్రఖని చేశాడు. తెలుగులో ఈ పాత్రను పవన్ కళ్యాణ్ చేస్తున్నాడని వినిపిస్తోంది. తెలుగు నేటివిటీకి అనుగుణంగా కథలో మార్పులు చేస్తున్నారట. సముద్రఖని దర్శకత్వంలోనే ఈ రీమేక్ తెరకెక్కనుంది. తంబిరామయ్య పాత్రను ఎవరు పోషిస్తారు? మిగిలిన తారాగణం ఎవరన్నది తేలాల్సి ఉంది. ఈ సినిమా తరువాతే పవన్ ‘భవదీయుడు భగత్ సింగ్’ సెట్స్ లో అడుగు పెడతాడని టాక్.

Exit mobile version