NTV Telugu Site icon

Pawan Kalyan: తొలిప్రేమ చూస్తూ అభిమానుల అత్యుత్సాహం… థియేటర్ ధ్వంసం

Pawan Kalyan

Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘తొలిప్రేమ’ సినిమా 25 ఏళ్ల తర్వాత రీరిలీజ్ అయ్యి థియేటర్స్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మెగా ఫాన్స్ మాత్రమే కాకుండా సినీ అభిమానులందరూ థియేటర్స్ కి వెళ్లి తొలిప్రేమ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మెగా అభిమానులు చేసిన హద్దులు దాటి చేసిన హంగామాకి థియేటర్ ధ్వంసం అయ్యింది. వివరాల్లోకి వెళ్తే… కపర్థి సినిమా ధియేటర్ లో నిన్న తొలిప్రేమ సినిమా రిలీజ్ అయ్యింది, సెకండ్ షో సమయంలో పవన్ ఫాన్స్ అభిమానం పేరుతో బీభత్సం సృష్టించారు. సినిమా తెర చించేసి, సీట్లు ధ్వంసం చేసి కొందరు యువకులు నానా హంగామా చేసారు.

దీనిపై స్పందించిన థియేటర్ యాజమాన్యం… “థియేటర్ ధ్వంసం చెయ్యాలనే కుట్రతోనే ఫాన్స్ వచ్చారు, సినిమా మధ్య లో పది మంది అకస్మాత్తుగా లేచి గొడవ చేశారు. స్క్రీన్ పైకి ఎక్కి కోసేశారు, సీట్ల పైకి ఎక్కి పీకేశారు. అడ్డు వచ్చిన సిబ్బంది పై దాడి చేసి కొట్టారు. సిసి కెమెరాలు, బయట అద్దాలు కూడా ధ్వంసం చేశారు పవన్ కళ్యాణ్ అభిమానులు పేరుతో కావాలనే చేశారు. నిజంగా ఇది అభిమానులే చేశారా అనేది తేల్చాలి. జరిగిన ఘటన చూస్తే విధ్వంసం వెనుక కుట్ర ఉందనే అనుమానం పోలీసులు విచారణ చేసి ధ్వంసం చేసిన వారిని శిక్షించాలి. ఇటువంటివి జరగకుండా పవన్ కళ్యాణ్ కూడా తమ అభిమానులను కంట్రోల్ చేయాలి” అన్నారు. ఈ విషయమై సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతోంది. సినిమా చూడడానికి వచ్చి థియేటర్ ని ధ్వంసం చేసింది నిజంగా పవన్ అభిమానులేనా లేక దీని వెనక ఏదైనా కుట్ర కోణం ఉందా అనేది తెలియాల్సి ఉంది.