Site icon NTV Telugu

Pavitra Lokesh: రిలేషన్‌లో పెద్ద ట్విస్ట్.. డబ్బు కోసమే నరేష్‌తో సంబంధం?

Pavitra Lokesh Naresh

Pavitra Lokesh Naresh

Pavitra Lokesh Makes Contract With Naresh For Relationship: పవిత్ర లోకేష్, నరేష్‌ల వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే! వీళ్లిద్దరు ఎఫైర్‌లో ఉన్నారని వార్తలు రావడం.. నరేష్ మూడో భార్య రమ్య వాళ్లను ఒక హోటల్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం.. అది పెద్ద దుమారం రేపడం.. అంతా జరిగిపోయింది. కొన్ని రోజుల పాటు వీరి గురించే ఇటు ఇండస్ట్రీలో, అటు తెలుగు రాష్ట్రాల్లో తెగ చర్చలు జరిగాయి. పవిత్రతో నరేష్ ఎఫైర్ పెట్టుకున్నాడని రమ్య ఆరోపణలు చేస్తోంది కానీ.. అందులో ఎంతవరకు నిజం ఉన్నదన్నది ఇంకా మిస్టరీగానే ఉంది. ఎందుకంటే.. తాము మంచి స్నేహితులమే తప్ప, అంతకుమించి తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని వాళ్లిద్దరు వాదిస్తున్నారు కాబట్టి!

ఆ సంగతి అలా ఉంచితే.. తాజాగా పవిత్ర, నరేష్‌ల గురించి ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. డబ్బు కోసమే నరేష్‌తో పవిత్ర రిలేషన్‌లో ఉందన్నది ఆ వార్త సారాంశం. అసలు వీళ్ల బంధం ఒక ఒప్పందంతోనే కుదిరిందని ప్రచారం జరుగుతోంది. ఆ ఒప్పందం ప్రకారం.. నరేష్ నెలకు రూ. 25 లక్షలు పవిత్రకి ఇవ్వాలట! అలా ఇస్తేనే.. నరేష్‌తో రిలేషన్‌లో ఉండేందుకు పవిత్ర అంగీకారం తెలిపిందని గాసిప్పులు గుప్పుమంటున్నాయి. అంతేకాదు.. ఒకవేళ విడిపోవాల్సి వస్తే, అప్పుడు ఆమెకు భరణంగా ఏకంగా రూ. 50 కోట్లు పారితోషికం చెల్లించాలట! అంత డబ్బులు ఇచ్చేందుకు నరేష్ ఓకే చెప్పిన తర్వాత, ఆయనతో రిలేషన్‌షిప్‌లో ఉండేందుకు పవిత్ర ఒప్పుకున్నట్టు ఒక రూమర్ బాగా వైరల్ అవుతోంది. అయితే.. ఇందులో ఎంతవరకు నిజముందో తెలీదు.

Exit mobile version