NTV Telugu Site icon

Pavan Sadineni: ‘దయా’ డైరెక్టర్ కి బంపర్ ఆఫర్.. ఏకంగా ఆ హీరోతో సినిమా?

Pavan Sadineni

Pavan Sadineni

Pavan Sadineni Movie in Geetha Arts: దయ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, నంబీసన్ రమ్య, కమల్ కామరాజ్ తదితరులు కీ రోల్స్ లో నటించిన ఈ వెబ్ సిరీస్ ను ఎస్వీ ఎఫ్ ప్రొడక్షన్స్ లో శ్రీకాంత్ మొహతా, మహేంద్ర సోని నిర్మించగా ఇంట్రెస్టింగ్ గా రూపొందించారు దర్శకుడు పవన్ సాధినేని. దయ సూపర్ హిట్టైన నేపథ్యంలో తన సంతోషాన్ని పంచుకున్నారు టాలెంటెడ్ డైరెక్టర్ పవన్ సాధినేని. ఆయన మాట్లాడుతూ దయా వెబ్ సిరీస్ కు వస్తున్న రెస్పాన్స్ సంతోషాన్నిస్తోందని, సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినట్లు స్ట్రీమింగ్ మొదలైనప్పటి నుంచి మా వెబ్ సిరీస్ చూస్తున్నారని ఆయన అన్నారు. ప్రతి చోట నుంచీ మంచి రెస్పాన్స్ వస్తోందని పేర్కొన్న ఆయన ఇటీవల చేసిన టూర్ లోనూ ప్రతి ఏరియాలో ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటున్నారని అన్నారు. ఇండస్ట్రీ నుంచైతే చాలా కాల్స్ మెసేజ్ లు వస్తున్నాయని పేర్కొన్న ఆయన బెంగాలీ వెబ్ సిరీస్ తక్ ధీర్ నుంచి ఇన్స్పైర్ అయి దయ కథ రాసుకున్నానని అన్నారు.

NC 23: జాలరిగా నాగచైతన్య.. అమాంతం అంచనాలు పెంచేస్తున్న ది ఫస్ట్ కట్ డాక్యుమెంటేషన్

అయితే తక్ ధీర్ లో ఇంత విస్తృతమైన కథ ఉండదని, రిపోర్టర్, దయా అసిస్టెంట్ ఇలా..ఇన్ని క్యారెక్టర్స్ ఉండవని అన్నారు. ఆ వెబ్ సిరీస్ నుంచి కేవలం ఆంబులెన్స్ డ్రైవర్ కు డెడ్ బాడీ దొరకడం అనే అంశాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నానని, మిగతా అంతా నేను రాసుకున్నదేనని అన్నారు. దయా సీజన్ 1కు డబుల్ స్కేల్ లో సీజన్ 2 ఉంటుందని పేర్కొన్న ఆయన ఇప్పటికే స్క్రిప్ట్ మొత్తం సిద్ధమైందని అన్నారు. అన్నీ కుదిరాక వెంటనే సెట్స్ మీదకు తీసుకెళ్తానని పేర్కొన్న ఆయన ఇకపై సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా చేస్తానని అన్నారు. గీతా ఆర్ట్స్ లో నేనొక సినిమాకు అగ్రిమెంట్ చేసుకున్నానని హీరో ఎవరు అనేది చెప్పలేను కానీ పెద్ద కాస్టింగ్ తో ఆ సినిమా ఉంటుందని, అది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకోవచ్చని అన్నారు. ఆ సినిమాలో నాకు కావాల్సిన కాస్ట్ అండ్ క్రూ డేట్స్ కోసం వేచి చూస్తున్నా, ఇంతలో దయా ఆఫర్ వచ్చిందని అన్నారు.. అరవింద్ గారికి చెబితే ఏప్రిల్ దాకా మన సినిమాకు టైమ్ ఉంది కదా ఈలోపు చేసుకుని వచ్చేయ్ అన్నారని అలా దయా స్టార్ట్ చేశామని అన్నారు.

Show comments