తమిళ నటి ఆ పార్వతి తిరువోతు ఓ సినిమా షూటింగ్ లో తనకు జరిగిన చేదు సంఘటన గురించి చేసిన వ్యాఖ్యలు సొషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకీ అసలు మ్యాటర్ లోకి వెళితే తమిళ్ లో ధనుష్ హీరోగా 2013లో మరియన్ అనే సినిమా వచ్చింది. భరత్ బాలా దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా షూటింగ్ గురించి మాట్లాడుతూ ‘ నేను తమిళంలో ‘మరియన్’ అనే సినిమాలో నటించాను.
Also Read : MSG : మన శంకరవరప్రసాద్ గారు డే – 1 కలెక్షన్స్..
షూటింగ్ మొదటి రోజు షూటింగ్ లో హీరో ధనుష్ తో లవ్ సీన్ చేస్తున్నాను ఆ సీన్ లో నన్ను పూర్తిగా నీళ్లలో ముంచేశారు. వాళ్ళు నాపై నీళ్లు పోస్తున్నారు. సీన్ సరిగా రాలేదని మళ్ళి మళ్ళి నీళ్లు పోస్తూనే ఉన్నారు. అప్పడు చాలా ఇబ్బంది పడ్డాను. కానీ నా చుట్టూ ఎవరూ నన్ను జాగ్రత్తగా చూసుకోలేదు. ఒకానొక సమయంలో నేను వాళ్ళ దగ్గరికి తిరిగి వెళ్లి హోటల్ కి వెళ్లి బట్టలు మార్చుకుని వస్తాను కాస్త బ్రేక్ ఇవ్వండి అని చెప్పను. వాళ్ళు కాదు అది సాధ్యం కాదు అని అన్నారు. నాకు ఇంకా ఓపిక నశించి గట్టిగా అరుస్తూ ” నేను పీరియడ్స్ లో ఉన్నాను. నేను వెళ్లాలి అని అరిచాను. వాళ్ళు ఏమనుకుంటారోనని కూడా నేను అసలు ఆలోచించలేదు. అప్పడు సెట్ లో 50 మంది ఉన్నారు. వాళ్ళలో ముగ్గురు మాత్రమే అమ్మాయిలు. అవేవి పట్టించుకోకుండా నేను వెళ్ళిపోయాను.
