Parvathy Nair Gives Strong Warning To Media: నటీనటుల జీవితం ఎంత విలాసవంతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. లక్షలు, కోట్లలో పారితోషికం వస్తుంది కాబట్టి.. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ట్రిప్పులకు వెళ్లడం, పార్టీలు చేసుకోవడం వంటివి చేస్తుంటారు. కొంచెం టైం దొరికినా సరే, దాన్ని ఎంజాయ్ చేయడానికే వినియోగిస్తుంటారు. పైగా.. ఇండస్ట్రీలో ఉన్న వారు ఆడ, మగ అనే బేధాలు అస్సలు చూడరు. అందరితోనూ సమానంగా మెలుగుతూ.. పార్టీలు చేసుకుంటారు. ఇది ఓపెన్ సీక్రెట్టే! కానీ.. గుచ్చి గుచ్చి ప్రస్తావిస్తే మాత్రం, ఎవ్వరికైనా కోపం వస్తుంది. ఇప్పుడు పార్వతి నాయర్‌కు కూడా అలాగే కోపం వచ్చింది. మగవారితో రాత్రుల్లో పార్టీలు చేసుకుంటుందని మీడియాలో కథనాలు రావడంతో.. మీడియాపై ఫైర్ అయ్యింది. తన ఇమేజ డ్యామేజ్ చేసే విధంగా వార్తలు రాస్తే, సహించనంటూ వార్నింగ్ ఇచ్చింది.
అసలేం జరిగిందంటే.. చెన్నై నుంగంబాక్కంలో నివసిస్తున్న పార్వతీ నాయర్ ఇంట్లో ఇటీవల రూ.9 లక్షల విలువైన రెండు వాచీలు, లాప్ టాప్, సెల్ ఫోన్ చోరీకి గురయ్యారు. అదే సమయంలో.. ఆమె ఇంట్లో పని చేసే చంద్రబోస్ అనే వ్యక్తి కూడా కనిపించకుండా పోయాడు. దీంతో.. అతనిపై అనుమానంతో పార్వతీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడే ఆ వస్తువుల్ని దొంగలించి ఉంటాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే చంద్రబోస్ మీడియా ముందుకొచ్చి.. పార్వతీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. పార్వతీ నాయర్ తన ఇంట్లో రాత్రి మగ స్నేహితులతో పార్టీలు చేసుకుంటుందని ఆరోపించాడు. ఈ విషయాన్ని తాను గమనించడంతో.. కించపరిచే విధంగా తన పట్ల ప్రవర్తించిందని పేర్కొన్నాడు. ఈ వార్త పలు ఛానెళ్లలో ప్రసారమైంది. ‘మగ స్నేహితులతో పార్టీ’ అనే అంశాన్ని బాగా హైలైట్ చేశారు.
ఆ వార్తలు చూసి తీవ్ర ఆగ్రహానికి గురైన పార్వతీ నాయర్.. తన గురించి తప్పుడు ప్రచారం చేస్తే సహించలేనంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తన ఇమేజ్ డ్యామేజ్ చేసే చర్యలకు మీడియా పాల్పడుతోందని మండిపడింది. నిజానిజాలు తెలుసుకోకుండా, ఇష్టానుసారం వార్తలు ప్రసారం చేస్తే.. వారిపై తగిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది. అంతేకాదు.. తనకు కళంకం ఆపాదించే చర్యలకు పాల్పడే కొన్ని మీడియా సంస్థలపై పరువు నష్టం దావా కూడా వేస్తానని పార్వతీ తెలిపింది. దీంతో.. ఈ వ్యవహారం ఇప్పుడు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.
