Paruchuri Gopala Krishna: టాలీవుడ్ సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో మంచి సినిమాలను ఇండస్ట్రీకి అందించిన ఘనత పరుచూరి బ్రదర్స్ ది. ఇక ఈ మధ్య కాహళను అందించడం మానేసిన గోపాల్ కృష్ణ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా సినిమా విశ్లేషకుడుగా మారారు. ఏదైనా సినిమా గురించి చర్చిస్తూ వాటిలో లోపాలను సవరిస్తున్నారు. ఇటీవలే రామ్ నటించిన ది వారియర్ ఎందుకు ప్లాప్ అయ్యిందో చెప్పిన గోపాలకృష్ణ తాజాగా మహేష్ బాబు కుటుంబం గురించి మాట్లాడారు. ఇటీవలే మహేష్ బాబు తన తల్లి ఇందిరా దేవిని పోగొట్టుకున్న విషయం విదితమే. ఇక ఆమె సంస్కరణ సభకు హాజరయిన గోపాలకృష్ణ అక్కడ మహేష్, కృష్ణ ల పరిస్థితి చూసి గుండె తరుక్కుపోయిందని చెప్పుకొచ్చాడు.
“ఘట్టమనేని కుటుంబంతో నాకున్న అనుభందం ఎన్నోసార్లు మీకు తెలియజేశాను. మహేష్, కృష్ణ, రమేష్ బాబు, ఆది శేషగిరిరావు.. వీరందరితో ఒక కుటుంబలో కుటుంబంగా కలిసిపోతూ వచ్చాం. ఎన్నో ఏళ్ల నుంచి మాకు మంచి అనుబంధం ఉంది. నేను అమెరికా నుంచి వచ్చేలోగానే మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి కాలం చేశారు. ఇక ఏకాదశి దినాన వారిని కలిసినప్పుడు కృష్ణగారిని చూస్తే గుండె తరుక్కుపోయింది. అసలు మహేష్ బాబును అలా ఎప్పుడు చూడలేదు. ఇన్నేళ్ళలో మహేష్ అలా ఉండడం ఎప్పుడు చూడలేదు. ఇందిరమ్మ అంటే మా దృష్టిలో దేవత, మహాలక్ష్మి. ఆమె ఎక్కువగా మాట్లాడరు. ఎప్పుడూ మౌనంగానే ఉంటారు. అందర్నీ చిరునవ్వుతో పలకరిస్తుంటారు. ఆమె కాలం చేసిందని తెలిసి బాధపడ్డా. ఇక సంస్కరణ సభలో కృష్ణ గారిని చూసి ఆశ్చర్యమేసింది. సాహసమే ఆయన ఊపిరి అన్నట్లు ఏదైనా తట్టుకోగల సత్తా ఆయనలో ఉంది. ఇక మహేష్ బాబును చిరునవ్వు లేకుండా దిగులుగా చూడడం మా పరిచయం అయ్యాక ఇదే మొదటిసారి. ఎప్పుడు ఆయన పెదాలపై చిరునవ్వు ఉంటుంది.. కోపమొచ్చినా ఆయన పెదాలపై చిరునవ్వు ఉంటుంది. కానీ, ఆ తల్లి జ్ఞాపకాల్లో మహేష్ బాబు పెదాలపై చిరునవ్వు మాయమైపోయింది” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
