NTV Telugu Site icon

Paruchuri Gopala Krishna: గుంటూరు కారం మహేష్ రేంజ్ సినిమానే కాదు.. షాకిస్తున్న పరుచూరి పలుకులు

Guntur Kaaramn

Guntur Kaaramn

Paruchuri Gopala Krishna Comments on Guntur Kaaram: పరుచూరి గోపాల కృష్ణ తెలుగు చిత్రసీమలో మరచిపోలేని ఒక స్టార్ స్క్రీన్ రైటర్, ఆయన 350కు పైగా సినిమాలకి రచయితగా వ్యవహరించారు. ఇక ఇప్పుడు సినిమాలకు దూరమైన ఆయన యూట్యూబ్‌లో ‘పరుచూరి పలుకులు’ అనే పేరుతో సమకాలీన ఇండియన్ ముఖ్యంగా తెలుగు సినిమాలను విశ్లేషణ చేస్తూ టైం పస చేస్తున్నారు. నిజానికి ఈ దిగ్గజ రచయిత విమర్శలకు దూరంగా ఉంటారు. అయితే అప్రకటిత రిటైర్మెంట్ తర్వాత , ఇటీవలి కాలంలో అతను తనకు నచ్చని సినిమాలను క్రిటిసైజ్ చేస్తున్నారు. 2020లో, సంక్రాంతికి విడుదలైన సరిలేరు నీకెవ్వరుపై చేసిన వ్యాఖ్యలకు మహేష్ బాబు అభిమానులకు కోపం వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సారి, సూపర్ స్టార్ మహేష్ తాజా చిత్రం, గుంటూరు కారం (2024)ని విమర్శించినందుకు అతను మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. ‘గురూజీ’ త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై ప్రశంసలు కురిపించడం ద్వారా ఎపిసోడ్‌ను ప్రారంభించినా విమర్శలు మాత్రం గట్టిగానే చేశారు. స్క్రిప్ట్‌ను ‘ఫ్యామిలీ సబ్జెక్ట్’ అని లేబుల్ చేస్తూ, మాస్ ఇంప్రెషన్‌ను కలిగించే సినిమా టైటిల్ పెట్టి తప్పుదారి పట్టించడం తప్పని అన్నారు. అభిమానులను ఇంప్రెస్ చేయడంపై దృష్టి సారించిన దర్శకుడు కోర్ భావోద్వేగాలను వర్క్ చేయించడంలో విఫలమయ్యారని ఆయన అన్నారు. చాలా మంది విమర్శకులు చెప్పినట్లుగా, పరుచూరి కూడా ప్రధాన పాత్రలు, ముఖ్యంగా శ్రీలీల పాత్ర పేలవంగా ఉందని పేర్కొన్నారు.

Amaran: శివ కార్తికేయన్ టైటిల్ టీజర్ అదిరింది.. కానీ, ఆమె కూడా ఉంటే ఇంకా బావుండేది

“తల్లి కొడుకుల సెంటిమెంట్ ఉన్న సినిమాని డీల్ చేస్తున్నప్పుడు ‘గుంటూరు కారం’ అనే టైటిల్ కాకుండా ‘గుంటూరు వారి అబ్బాయి’ లాంటి టైటిల్ పెడితే దానికి న్యాయం జరిగేదని ఆయన అన్నారు. మీరు కారం అని పేరు పెట్టినట్లు, మసాలా అంతా చల్లాలని ప్రయత్నించారు, కానీ మహేష్ బాబు రేంజ్ హీరోకి ఈ కథ సరిపోదని అన్నారు. మహేష్ బాబు పట్ల తనకు చాలా గౌరవం ఉందని, అయితే అతను ఇలాంటి రిజల్ట్ అందిస్తాడని ఎప్పుడూ ఊహించలేదని చెప్పాడు. రచయిత తన తల్లి మంత్రి అవడం కోసం కొడుకు నుండి సంతకం తీసుకోవడం వంటి చిన్న ఆలోచనను చాలా సెంటిమెంట్‌తో డీల్ చేయాలని కానీ అది వర్కౌట్ అవ్వలేదని అన్నారు.