Site icon NTV Telugu

Paris Jackson: గ్రామీ ఈవెంట్ కోసం 80 టాటూలు దాచేసిన మైఖేల్ జాక్సన్ కూతురు

Paris Jackson Tattoos

Paris Jackson Tattoos

Paris Jackson shocks fans with new Grammys look: దివంగత డ్యాన్సర్ మైఖేల్ జాక్సన్ కుమార్తె, సింగర్ పారిస్ జాక్సన్ తాజాగా జరిగిన గ్రామీ అవార్డుల వేడుకలో కనిపించింది. ఈ ఫంక్షన్‌లో పారిస్ జాక్సన్ చాలా స్టైలిష్ అవతార్‌లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. పారిస్ హై స్లిట్‌తో చాలా అందమైన బ్లాక్ ఆఫ్ షోల్డర్ డ్రెస్‌ని పారిస్ జాక్సన్ ధరించింది. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ సమయంలో పారిస్ జాక్సన్ శరీరంపై ఒక్క పచ్చబొట్టు కూడా కనిపించలేదు. నిజానికి తన శరీరంపై 80 టాటూలు ఉన్నాయని పారిస్ జాక్సన్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది, అందుకు తగ్గట్టుగానే ఆమె ఒంటి మీద కూడా అనేక రకాల టాటూలు కనిపిస్తూ ఉండేవి. అయితే 66వ గ్రామీ అవార్డుల నుండి పారిస్ జాక్సన్ ఫొటోలు కొన్ని బయటకు వచ్చాయి.

Mahi V Raghav: ఆ రాళ్లు ఎత్తే ఓపిక లేదు.. బురద తుడుచుకునే ఓపిక లేదు..

ఆ ఫొటోలలో ఆమె శరీరంపై ఒక్క టాటూ కూడా కనిపించకపోవడంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. తన శరీరంపై దాదాపు 80 టాటూలు ఉన్నాయని పారిస్ 2022లోనే ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆ తరువాత కూడా గత కొన్నేళ్లుగా ఆమె శరీరంపై వివిధ చోట్ల టాటూలు వేయించుకుంటున్నారు. పారిస్ తరచుగా తన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఉంటుంది, అక్కడ కూడా ఆమె ఫొటోలలో ఆ టాటూలు కనిపిస్తూ ఉంటాయి. అంతేకాదు ఆమె తన తండ్రి మైఖేల్ గౌరవార్థం కూడా కొన్ని టాటూలు వేయించుకుంది. తాజాగా ప్యారిస్ స్టార్ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ టైసన్ ఫౌంటైన్‌ను చేర్చుకుంది, అందువల్లనే గ్రామీలలో ఆమెను దాదాపుగా గుర్తించలేకపోయినట్టు చెబుతున్నారు. ఫౌంటైన్ కవర్ Fx ఉత్పత్తులను ఉపయోగించి వాటిని కప్పిపుచ్చినట్టు తెలుస్తోంది.

Exit mobile version