జగపతిబాబు, శరత్ కుమార్ ప్రధాన పాత్రధారులుగా నవీన్ చంద్ర, ఇషాన్, ఆకాంక్ష సింగ్ తో డిస్నీ హాట్ స్టార్ తొలి సీరీస్ ను నిర్మించింది. ‘పరంపర’ పేరుతో తెరకెక్కిన ఈ సీరీస్ కి కృష్ణ విజయ్ ఎల్ దర్శకత్వం వహించారు. ఈ నెల 24 నుంచి ఈ సీరీస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ ఫ్యామిలీ డ్రామా సిరీస్ లో అధికారం, అవినీతి, తరతరాల శత్రుత్వం ప్రధానాంశాలుగా ఉండనున్నాయి.
‘బాహుబలి’ నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఆర్కా మీడియా పతాకంపై ఈ సీరీస్ ను నిర్మించారు. దీనికి హరి యెల్లేటి కథను సమకూర్చగా కృష్ణ విజయ్, విశ్వనాథ్ అరిగెల దర్శకత్వం వహించారు. ఈ సీరీస్ ట్రైలర్ ను బుధవారం విడుదల చేశారు. మరి బాహుబలి సీరీస్ తో అందరినీ ఆకట్టుకున్న నిర్మాతలు ఈ ‘పరంపర’ సీరీస్ తో ఎలాంటి ముద్ర వేస్తారో చూడాలి.
