NTV Telugu Site icon

Jagapathi Babu: రామ్ చరణ్ ఆవిష్కరించిన ‘పరంపర-2’ ట్రైలర్!

Parampara 2

Parampara 2

 

డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో మంచి విజయాన్ని సాధించిన వెబ్ సిరీస్ ‘పరంపర’. దాని సీజన్ -2 ట్రైలర్ వచ్చేసింది. జగపతి బాబు, శరత్‌కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించిన ఈ వెబ్ సీరిస్ ను ఎల్. కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్‌ డైరెక్ట్ చేశారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను నిర్మించారు. పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా ఇది రూపొందించారు. ఈ సెకండ్ సిరీస్ ఈ నెల 21 తేదీ నుంచి స్ట్రీమింగ్ ప కాబోతోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను స్టార్ హీరో రామ్ చరణ్ విడుదల చేశారు. ‘పరంపర- 2’ ట్రైలర్ విడుదల చేయడం సంతోషంగా ఉందని ట్వీట్ చేసిన రామ్ చరణ్, టీమ్ అందరికీ బెస్ట్ విషెస్ తెలిపారు.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే, ఇంటెన్స్ పొలిటికల్ డ్రామాగా ‘పరంపరం -2’ వెబ్ సిరీస్ ఉండబోతోందని తెలుస్తోంది. ‘ఈ యుద్ధం ఎవరి కోసం మొదలు పెట్టావో గుర్తుంది కానీ ఎందుకోసం మొదలుపెట్టావో గుర్తు లేదు’ అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. ‘ఫ్రీడమ్ కోసం, మా నాన్న దగ్గర లాకున్న అధికారం కోసం, పోగొట్టుకున్న పేరు, కోల్పోయిన జీవితం అన్నీ తిరిగి కావాలి’ అంటూ నవీన్ చంద్ర చెప్పిన డైలాగ్స్ పవర్ ఫుల్ గా ఉన్నాయి. నవీన్ చంద్ర, జగపతి బాబు, శరత్ కుమార్ పాత్రల మధ్య హోరాహోరీ ఘర్షణ ఆకట్టుకుంటోంది. ఓ రియల్ రివేంజ్ యాక్షన్ డ్రామా ట్రైలర్ లో ఆవిష్కృతమైంది. మూడు జనరేషన్స్ కి సంబంధించిన కథతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. స్ట్రాంగ్ ఎమోషన్స్ తో సెకండ్ సీజన్ ఆకట్టుకుంటుందని నిర్మాణ సంస్థ వెల్లడించింది.

 

 

 

Show comments