సి. రమేశ్ నాయుడు దర్శకత్వంలో గద్దె శివకృష్ణ, వెలగ రాము సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘పంచనామ’. ఈ మూవీ టైటిల్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు విడుదల చేసి యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు సిగటాపు రమేశ్ నాయుడు మాట్లాడుతూ, ”మా చిత్ర నిర్మాతలకు ముందు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ కథ విని, నన్ను నమ్మి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా దీనిని తెరకెక్కించేందుకు సహకరించారు. ఒక వినూత్నమైన కథతో ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాం. ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాం. అలాగే ఈ చిత్రంలో నటించిన నటీనటులు అందరూ వారి పాత్రలకు న్యాయం చేశారు. ఈ చిత్రం కోసం పనిచేసిన సాంకేతిక వర్గానికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం” అని అన్నారు. అలానే నిర్మాతలు మాట్లాడుతూ, ”ఈ చిత్రాన్ని కథలోని ఇంటెన్సిటీ తగ్గకుండా జనాదరణ పొందే విధంగా నిర్మాణ విలువలతో నిర్మించటం జరిగింది.త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాం” అని అన్నారు. త్రిపుర నిమ్మగడ్డ, వెంప కాశీ, సంజీవ్ జాధవ్, ముక్కు అవినాష్, ఆలపాటి లక్మి, ఆంజనేయులు తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ప్రదీప్ చంద్ర సంగీతం అందిస్తున్నారు.
‘దిల్’ రాజు చేతుల మీదుగా ‘పంచనామ’
