Site icon NTV Telugu

Panchayat Season 3: అమెజాన్ బ్లాక్ బస్టర్ సిరీస్ 3వ సీజన్ వచ్చేస్తోంది

Panchayat Season 3

Panchayat Season 3

Panchayat Season 3 is arriving: పంచాయత్ సీజన్ 3 త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న మొదటి రెండు సీజన్లను ఉచిత స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంచారు. పంచాయత్ సిరీస్ ని అత్యుత్తమ వెబ్ సిరీస్‌గా పరిగణించబడుతుంది. మొదటి రెండు సీజన్లు అందించిన సహజమైన, చక్కని వినోదంతో అభిమానులు, వీక్షకులు మంత్రముగ్ధులయ్యారు. ఇప్పుడు శుభవార్త ఏమిటంటే పంచాయత్ సీజన్ 3 వస్తోంది. దీంతో అంతకు ముందు ఉన్న మొదటి రెండు సీజన్‌లమీ ఉచిత స్ట్రీమింగ్ కోసం అందుబాటులోకి తెచ్చారు. ఎట్టకేలకు డిసెంబర్ 9న ‘పంచాయతీ 3’ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. అభిషేక్ త్రిపాఠి పేరుతో జితేంద్ర కుమార్ తన బైక్‌పై ఉన్నట్టు లుక్ రిలీజ్ చేశారు.

Vidyut Jammwal: అడవుల్లో నగ్నంగా స్టార్ హీరో.. వర్మ సంచలన వ్యాఖ్యలు

అశోక్ పాఠక్ (బినోద్), అతని స్నేహితులు దుర్గేష్ కుమార్, బుల్లో కుమార్ ట్రేడ్‌మార్క్ ఎక్స్‌ప్రెషన్‌తో రంగులరాట్నంపై రెండవ ఫోటోలో కనిపించారు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో ఇదే విషయాన్ని షేర్ చేస్తూ, ప్రైమ్ వీడియో ఇలా పేర్కొంది, “నిరీక్షణ భరించలేనిదని మాకు తెలుసు, కాబట్టి మేము సెట్స్ నుండి మీకు కొంత ఊరటనిచ్చాము! #PanchayatOnPrime సీజన్ 3 అని రాసుకొచ్చింది. ఇక ” 54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) ‘పంచాయత్ సీజన్ 2’ కోసం ప్రారంభ ఉత్తమ వెబ్ సిరీస్ (OTT) అవార్డును గెలుచుకున్న ప్రైమ్ వీడియోకి ఇది ఒక చారిత్రాత్మక క్షణం. ఈ అద్భుతమైన విజయం భారతదేశ ఔత్సాహిక స్ట్రీమింగ్ రంగాన్ని గుర్తించడం, పెంపొందించడం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేసింది. 10 భాషల్లోని 15 విభిన్న ప్లాట్‌ఫారమ్‌ల నుండి 32 ఎంట్రీలు ఈ అవార్డు కోసం పోటీ పడగా ‘పంచాయత్ కి ఆ అవార్డు దక్కింది.

Exit mobile version