Panchali Panchabhartruka: హీరోగా మారుతున్న రాప్ సింగర్ రోల్ రైడా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పక్కా ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్స్‌కి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడుతుంటారు. సరిగ్గా అదే కోవలో, అవుట్ అండ్ అవుట్ నవ్వులు పూయించేందుకు సిద్ధమవుతున్న సరికొత్త చిత్రం “పాంచాలి పంచభర్తృక”. నటకిరీటి రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని రోయల్ థ్రోన్ ప్రొడక్షన్స్, ఓం సాయిరాం ఆర్ట్స్ బ్యానర్లపై రాజ్ పవన్, వెంకట్ దుగ్గిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గంగ సప్తశిఖర దర్శకత్వం వహిస్తున్నారు. టైటిల్‌తోనే ఆడియన్స్‌లో మంచి ఆసక్తిని రేకెత్తించిన ఈ మూవీ నుంచి.. ఇటీవల “సెనోరిటా రాసిస్తా నా ఆస్తి నీ పేరిట” అనే రెట్రో స్టైల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ పాటకు సోషల్ మీడియాలో అనూహ్య స్పందన లభిస్తుండటంతో పాటు ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా మీడియాతో సమావేశమై సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలను పంచుకుంది. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. “ఈ మధ్య కాలంలో నాకు ఇలాంటి వైవిధ్యమైన పాత్ర రావడం చాలా అరుదు. ఒకప్పటి నా సినిమాల్లో లాగానే.. ఈ చిత్రంలోనూ పాటలు, ఫైట్లతో నాటి వింటేజ్ రాజేంద్రప్రసాద్‌ను మీరు మళ్లీ చూస్తారు” అని ఎంతో ఉత్సాహంగా చెప్పారు. తన రాప్ సాంగ్స్‌తో యూత్‌లో క్రేజ్ తెచ్చుకున్న రోల్ రైడా, ఈ సినిమాలో మొదటిసారిగా హీరో పాత్రలో కనిపించబోతున్నాడు. “ప్రేక్షకులకు ఇదొక పర్ఫెక్ట్ ఫన్ ట్రీట్. సినిమా మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు ఆడియన్స్ నవ్వుతూనే ఉంటారు” అని రోల్ రైడా తెలిపాడు.
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్‌లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?