ఈ జనరేషన్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమలాని బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ లో షూటింగ్ చేస్తున్నాడు. ఆదిపురుష్ మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకోని రిలీజ్ కి రెడీ అవుతోంది. ప్రభాస్ ఎన్ని సినిమాలు చేస్తున్నా ప్రభాస్ ఫాన్స్ తో పాటు సినీ అభిమానుల దృష్టి అంతా ఒక్క ప్రాజెక్ట్ పైనే ఉంది. అది KGF 1&2 సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన ప్రశాంత్ నీల్ తో చేస్తున్న ‘సలార్’. మోస్ట్ వయోలెంట్ మ్యాన్ గా ప్రభాస్ నటిస్తున్న ఈ మూవీపై భారి అంచనాలు ఉన్నాయి. బ్యాట్ మాన్ కలర్ థీమ్ తో తెరకెక్కుతున్న సలార్ సినిమాని పాన్ వరల్డ్ స్థాయికి తీసుకోని వెళ్లడానికి హోంబలే మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న #Salaar ట్యాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ప్రశాంత్ నీల్, ప్రభాస్ ని ఎలా చూపించబోతున్నాడనే ఎగ్జైట్మెంట్ ప్రభాస్ ఫ్యాన్స్‌ను.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ చేసేలా చేస్తోంది. అందుకే ఇప్పుడు సలార్ టీజర్ టైం ఫిక్స్ అయిందని ఓ న్యూస్‌ని వైరల్ చేస్తున్నారు.
వాస్తవానికి చాలా రోజులుగా సలార్ టీజర్ ఇదిగో, అదిగో అంటూ సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి కానీ ఇప్పటి వరకూ దర్శక నిర్మాతల నుంచి ఎలాంటి అప్డేట్ బయటకి రాలేదు. దీనికి కారణం ప్రభాస్ పెట్టిన కండీషన్ అని తెలుస్తోంది. “ఆదిపురుష్ సినిమా రిలీజ్ అయ్యే వరకు మిగతా సినిమాల అప్డేట్స్ తగ్గించాలని, సలార్ నుంచి అనౌన్స్మెంట్ ఆదిపురుష్ రిలీజ్ వరకూ ఆపండని ప్రభాస్ కండీషన్ పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే ఇప్పట్లో సలార్ టీజర్ రిలీజ్ కావడం కష్టమేనని, ఆదిపురుష్ రిలీజ్ తర్వాతే సలార్ టీజర్ రానుందని అంటున్నారు. లేటెస్ట్ టాక్ ప్రకారం.. ఇప్పటికే సలార్ టీజర్‌ను కట్ చేసి పెట్టారట. వీలైతే సమ్మర్‌లో లేదా… ఆదిపురుష్ సినిమా రిలీజ్ అయిన సమయంలో, ఆదిపురుష్ ఆడే థియేటర్స్ లో సలార్ టీజర్ ని ప్లే చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఆదిపురుష్ రిలీజ్ అయ్యేనాటికి సలార్ రిలీజ్‌కు మూడు నెలల సమయం మాత్రమే ఉంటుంది. కాబట్టి.. జూన్, జూలైలో సలార్ సందడి స్టార్ట్ అవడం పక్కా అని చెప్పొచ్చు, అది ఆదిపురుష్ థియేటర్స్ లోనా లేక సెపరేట్ గానా అనేది చూడాలి.
