Site icon NTV Telugu

Adipurush: టాప్ 5… ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్

Adipurush Day 1 Estimated Collections

Adipurush Day 1 Estimated Collections

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఆదిపురుష్’ ఆడియన్స్ ముందుకి వచ్చింది. 2023 జనవరిలోనే  కావాల్సిన ఈ ఎపిక్ మూవీ, ఆరు నెలల డిలేతో రిలీజ్ అయ్యింది. ఆదిపురుష్ సినిమాకి మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ వినిపిస్తోంది. గ్రాఫిక్స్ విషయంలో దర్శకుడు ఓమ్ రౌత్ మరింత జాగ్రత్త పడి ఉంటే బాగుండేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిపురుష్ సినిమాలోని టాప్ 5 పాజిటివ్ అండ్ నెగటివ్ పాయింట్స్ ఏంటో చూద్దాం.

ప్లస్:

  1. ప్రభాస్… ఆదిపురుష్ సినిమాకి కొండంత బలం ప్రభాస్. ప్రస్తుతం ఇండియాలో ఏ హీరోకి లేనంత క్రేజ్ ఉన్న ప్రభాస్, ఆదిపురుష్ సినిమాలో శ్రీరాముడిగా నటించడంతో బజ్ జనరేట్ అయ్యింది. ప్రభాస్ కాకుండా ఇంకొకరు ఆదిపురుష్ సినిమా చేసి ఉంటే ఈరోజు ఆదిపురుష్ గురించి ఇంత డిస్కషన్ జరిగేది కాదేమో.
  2. మ్యూజిక్… టీజర్ తోనే నెగటివ్ కామెంట్స్, సోషల్ మీడియా ట్రోలింగ్ ఫేస్ చేసిన ఒక సినిమాని మళ్లీ పాన్ ఇండియా మాట్లాడుకునేలా చేసారు ఆంటే ఆ క్రెడిట్ పూర్తిగా ఆదిపురుష్ మ్యూజిక్ కి ఇచ్చేయ్యాల్సిందే. జై శ్రీరామ్ సాంగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆదిపురుష్ సినిమాకి ప్రాణం పోశాయి. ఈ మ్యూజిక్ లేకుండా ఆదిపురుష్ సినిమాని ఊహించడం కూడా కష్టమే.
  3. కెమెరా వర్క్… మోషన్ క్యాప్చర్ సినిమా చేసే సమయంలో టెక్నీకల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. గ్రాఫిక్స్ లో ఏం చూపించబోతున్నామో అనే విషయాన్ని ముందుగానే ఊహించి, దానికి తగ్గట్లుగా షూటింగ్ చెయ్యాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఆదిపురుష్ డీఓపీ కార్తీక్ పళనికి క్రెడిట్ ఇవ్వాల్సిందే.
  4. ప్రొడక్షన్ వాల్యూస్… ఈరోజు ఆదిపురుష్ సినిమా గురించి పాన్ ఇండియా ఆడియన్స్ అంతా మాట్లాడుకుంటున్నారు అంటే దానికి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా కారణమే. కోట్ల ఖర్చుకి వెనుకాడకుండా టీ-సీరీస్ ఆదిపురుష్ సినిమాని ప్రొడ్యూస్ చేసారు. సినిమా చూస్తున్నంత సేపు గ్రాండ్ గా కనిపిస్తుంది.
  5. కథ… ఆదిపురుష్ సినిమా పాజిటివ్స్ ఒక పది రాయాల్సి వస్తే అందులో ఇప్పటికే నాలుగు అయిపోయాయి కాబట్టి ఇంకో ఆరు విషయాలు చెప్పాల్సి వస్తే మిగిలిన అన్ని పాయింట్స్ లో ‘కథ’ని మెన్షన్ చెయ్యొచ్చు. తరాలు మారినా అందరికీ పూజనీయమైన రామాయణాన్ని వాల్మీకీ అందంగా అద్భుతంగా రచించాడు. మరో వంద సంవత్సరాల తర్వాత కూడా రామాయణ గాధ వినిపిస్తూనే ఉంటుంది. అలాంటి కథని ఎంచుకోవడమే ఓమ్ రౌత్ చేసిన గొప్ప విషయం.

మైనస్:

  1. విజువల్ ఎఫెక్ట్స్… ఆదిపురుష్ సినిమాని మొదటి నుంచి ఇబ్బంది పెడుతున్న విషయం ఇదే. 2D సినిమా చేసి ఉంటే ఆదిపురుష్ సినిమాపై ఇంత ట్రోలింగ్ జరిగేది కాదేమో కానీ మేకర్స్ తెలిసిన కథనే కొత్తగా చెప్పే ప్రయత్నంలో మోషన్ క్యాప్చర్ టెక్నలాజికి వెళ్లారు. ఆ గ్రాఫిక్స్ వర్క్ ఆడియన్స్ ని మెప్పించలేకపోతోంది.
  2. నటీనటుల ఎంపిక… ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ ని మాత్రమే ఆడియన్స్ ఓన్ చేసుకున్నారు కానీ మిగిలిన ఏ పాత్రకి కనెక్ట్ కాలేకపోయారు. ముఖ్యంగా రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ అసలు మెప్పించలేకపోయాడు. ఈ విషయంలో మిస్ కాస్టింగ్ జరిగింది. రామాయణంలో ప్రతి పాత్రకి ఒక ప్రాముఖ్యత ఉంది, అలాంటి కథతో సినిమా చేసే సమయంలో అన్ని పాత్రల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దర్శకుడు ఈ విషయంలో కాస్త రంగ్ క్యాలిక్యులేషన్ చేసాడు.
  3. కథనం… రామాయణం కథ ప్రతి ఒక్కరికీ తెలిసిందే, ఇప్పటికే ఈ కథతో ఎన్నో సినిమాలు వచ్చాయి. తెలిసిన కథ కాబట్టి కోణం మారితే బాగుండేదేమో కానీ ఓమ్ రౌత్… రామాయణాన్ని ఒక యుద్ధ కథగా మాత్రమే చూపించే ప్రయత్నం చేసాడు. వనవాసం నుంచే మొదలు పెట్టి యుద్ధం వరకూ ఆదిపురుష్ సినిమాని చూపించాడు. సీత అపహరణ తర్వాత ఉండాల్సిన ఎమోషన్ ని కనెక్ట్ చెయ్యడం కన్నా యుద్ధాన్ని చూపించడం పైన ఎక్కువ ద్రుష్టి పెట్టాడు. ఇది వార్ సినిమా కాదు అనే విషయాన్నీ ఓమ్ రౌత్ గుర్తు ఉంచుకోవాల్సింది.
  4. తెలిసిన కథ… పాన్ ఇండియా క్రేజ్ ఉన్న ప్రభాస్ లాంటి హీరో ఒక సినిమా చేస్తున్నాడు అనగానే ఎలాంటి సినిమా చేస్తున్నాడు అనే క్యూరియాసిటీ ఆడియన్స్ లో ఉంటుంది. అది కూడా నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు అంటే ఆ ఉత్సుకత ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే రామాయణం కథతో సినిమా అన్నారో, అప్పుడే ఆల్రెడీ చాలా చూసేసాం కదా ఇక కొత్తగా చూడడానికి ఏముంది అనే మాటలు మొదలయ్యాయి. దీంతో ప్రభాస్ ఏ సినిమా చేస్తున్నాడు అనే విషయం ఆడియన్స్ కి తెలిసిపోయింది, ఆ ఉత్సుకత తగ్గిపోయింది.
  5. ఓం రౌత్… ఆదిపురుష్ సినిమాని గురించి పది నెగటివ్ పాయింట్స్ రాయాల్సి వస్తే అందులో ఒకటి నుంచి పది వరకూ కనిపించే ఒకే ఒక్క పేరు ఓమ్ రౌత్ మాత్రమే. ప్రొడ్యూసర్స్ అడిగినంత డబ్బులు ఇచ్చారు, ప్రభాస్ లాంటి స్టార్ ని ఇచ్చారు, చేతిలో రామాయణం లాంటి ఎపిక్ స్టోరీ ఉంది… తాను చేయాల్సిందంతా జాగ్రత్తగా సినిమా చెయ్యడమే, ఈ విషయంలో ఓమ్ రౌత్ నిరాశపరిచాడనే చెప్పాలి.
Exit mobile version