NTV Telugu Site icon

The India House: పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్… హీరో అఖిల్ కాదు నిఖిల్…

India House

India House

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, విక్రమ్ రెడ్డి కలిసి స్టార్ట్ చేసిన ప్రొడక్షన్ హౌజ్ ‘వీ మెగా పిక్చర్స్’… అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కలిసి ఒక సినిమా చేస్తున్నాం అనే అనౌన్స్మెంట్ సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా వైరల్ అవుతూనే ఉంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో హీరోగా ఎవరు నటిస్తారు అనే డిస్కషన్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో కూడా భారీగానే జరిగింది. కొంతమంది మాత్రం చరణ్ కి అఖిల్ మంచి ఫ్రెండ్ కాబట్టి ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో అఖిల్ హీరోగా ఉంటాడు అనుకున్నారు. ఆల్మోస్ట్ ఇదే వార్త అందరి నుంచి వినిపించింది, అలా అనుకున్న వాళ్లందరికీ షాక్ ఇచ్చారు ప్రొడ్యూసర్స్. ‘ది ఇండియా హౌజ్’ అనే టైటిల్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన చరణ్, విక్రమ్, అభిషేక్ అగర్వాల్… ఈ సినిమాలో హీరోగా నిఖిల్ ని ఫైనల్ చేసారు. కార్తికేయ 2 సినిమాతో నిఖిల్ కి అభిషేక్ అగర్వాల్ కి మంచి రిలేషన్ ఏర్పడింది. నిఖిల్ కి నార్త్ లో కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇలాంటి సమయంలో అభిషేక్ అగర్వాల్, నిఖిల్ లకి చరణ్-విక్రమ్ లు కూడా కలవడం ‘ది ఇండియా హౌజ్’ ప్రాజెక్ట్ రేంజ్ ని పెంచే విషయమే. స్వాతంత్ర సమరయోధుడు వీర్ సావర్కర్ గారి 140 జయంతి సందర్భంగా… ఆయన జీవితంపైన ఈ ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసారు. రామ్ వంశీ కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నిఖిల్, శివ అనే పాత్రలో నటిస్తుండగా అనుపమ్ ఖేర్ ఇంపార్టెంట్ పాత్రలో నటిస్తుండడం విశేషం.

‘ఇండియా హౌజ్’ అనేది ఫిక్షనల్ కథ కాదు.. “1905 – 1910 మధ్య కాలంలో ఉత్తర లండన్‌లో, హైగేట్‌ లోని క్రోమ్‌వెల్ అవెన్యూలో ఉన్న విద్యార్థి వసతి భవనం. న్యాయవాది శ్యామ్‌జీ కృష్ణ వర్మ ప్రోత్సాహంతో, బ్రిటన్‌లోని భారతీయ విద్యార్థులలో జాతీయవాద భావాలను పురికొల్పడానికి దీన్ని ప్రారంభించారు. ఈ సంస్థ ఇంగ్లండ్‌లో ఉన్నత చదువుల కోసం వచ్చే భారతీయ యువకులకు స్కాలర్‌షిప్‌లను మంజూరు చేసేది. ఈ భవనం వేగంగా రాజకీయ క్రియాశీలతకు కేంద్రంగా మారింది. ఇది విదేశీ విప్లవ భారత జాతీయవాదానికి అత్యంత ప్రముఖమైనది. వివిధ సమయాల్లో భవనాన్ని ఉపయోగించిన జాతీయవాద సంస్థలను అనధికారికంగా సూచించడానికి “ఇండియా హౌస్” అనే పేరే వాడేవారు. “ది ఇండియన్ సోషియాలజిస్ట్” అనే పత్రికని ఈ హౌజ్ నుంచి నడిపే వారు. శ్యామ్‌జీ కృష్ణవర్మ నిష్క్రమణ తర్వాత, సంస్థకు వినాయక్ దామోదర్ సావర్కర్‌ కొత్త నాయకుడయ్యాడు. సావర్కర్ కథని లింక్ చేస్తూనే ‘ది ఇండియా హౌజ్’ సినిమా తెరకెక్కే అవకాశం ఉంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలో స్టార్ట్ అవ్వనుంది.

 

Show comments