తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కూలీ’. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఓ కీలక పాత్రలో కనిపిస్తుండగా, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్ నటిస్తుండగా తమిళ్ భామ శృతి హాసన్ ముఖ్య పాత్రలో మెరవనుంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ స్పెషల్ రోల్ లో కనిపించబోతున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి కీలక అప్డేట్ ఇచ్చారు మేకర్స్. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ‘కూలీ’ షూటింగ్ సోమవారంతో ముగిసిందని తెలియజేస్తూ అధికారకంగా ఓ వీడియోను రిలీజ్ చేసారు. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిజిటల్ రైట్స్ డీల్ ను ఇటీవల కంప్లిట్ చేసింది నిర్మాణ సంస్థ. సౌత్ ఇండియాటాప్ స్టార్స్ నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ రూ. 120 కోట్లకు కొనుగోలు చేసింది. రజనీ గత చిత్రం వెట్టయాన్ నిరాశపరిచిన కూడా లోకేష్ కనగరాజ్, రజనీ కాంబో కావడంతో ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుండి అటు ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. పూజ హెగ్డే స్పెషల్ సాంగ్ లో నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తుండగా సన్ పిచ్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నారు. ఈ ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది.
It's a super wrap for #Coolie 🔥@rajinikanth @Dir_Lokesh @anirudhofficial @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @hegdepooja @anbariv @girishganges @philoedit @Dir_Chandhru @PraveenRaja_Off pic.twitter.com/ulcecQKII1
— Sun Pictures (@sunpictures) March 17, 2025