NTV Telugu Site icon

Kabzaa: మార్చ్ 17న కన్నడ నుంచి మరో పాన్ ఇండియా సినిమా

Kabzaa

Kabzaa

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ గా పేరు తెచ్చుకున్న కిచ్చా సుదీప్, ఉపేంద్ర చాలా ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్న సినిమా ‘కబ్జా’. ఆర్ చంద్రు డైరెక్ట్ చేస్తున్న ఈ పాన్ ఇండియా గ్యాంగ్ స్టర్ డ్రామా రిలీజ్ డేట్ ని మేకర్స్ అనౌన్స్ చేశారు. మార్చ్ 17న కబ్జా మూవీ వరల్డ్ వైడ్ ఆడియన్స్ ముందుకి రానుంది. KGF స్టైల్ లో ఉన్న మేకింగ్ స్టిల్స్ అండ్ గ్లిమ్ప్స్ కబ్జా సినిమాపై అంచనాలని పెంచింది. సుదీప్, ఉపేంద్ర లాంటి యాక్టర్స్ ఉండడం కబ్జా సినిమాకి తెలుగు మార్కెట్ లో కలిసొచ్చే విషయం. శ్రియ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి రవి బసూర్ మ్యూజిక్ కి మెయిన్ ఎస్సెట్ అవ్వనుంది. కన్నడ నుంచి ఇటివలే మంచి కంటెంట్ ఉన్న సినిమాలు రిలీజ్ అయ్యి పాన్ ఇండియా హిట్స్ అవుతున్నాయి. కబ్జా సినిమా కూడా ఆ లిస్టులో చేరుతుందని కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. వారి నమ్మకాన్ని కబ్జా సినిమా నిజం చేస్తుందో లేదో తెలియాలి అంటే మార్చ్ 17 వరకూ ఆగాల్సిందే.

2018లో ప్రశాంత్ నీల్-యష్ లు కలిసి KGF చాప్టర్ 1 అనే సినిమా చేసి, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రమే కాదు ఎంటైర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు తిరిగి చూసేలా చేశారు. KGF 1తో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ, kgf చాప్టర్ 2, చార్లీ 777, అతడే శ్రీమన్నారాయణ, విక్రాంత్ రోణా, కాంతార సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా హిట్స్ ని కొట్టింది. ఈ లిస్టులో కబ్జా కూడా చేరుతుందేమో చూడాలి.

Read Also: Bahubali 2: మన రికార్డులని బ్రేక్ చెయ్యడం అంత ఈజీ కాదు కానీ…