NTV Telugu Site icon

Paluke Bangaramayena: జానకి కలగనలేదు కానీ.. పలుకే బంగారమాయెనా..?

Paluke Bangaramayena

Paluke Bangaramayena

Paluke Bangaramayena Serial Starting on Star maa: ఈమధ్య కాలంలో సినిమాలకు ఉన్న క్రేజ్ కంటే సీరియల్స్ క్రేజ్ చూస్తుంటే మెంటల్ ఎక్కిస్తోంది. ఇప్పటికే పలు చానల్స్ లో సీరియల్స్ ఆకట్టుకుంటూ ఉండగా ఇప్పుడు ‘స్టార్ మా’లో పలుకే బంగారమాయెనా అనే సీరియల్ తో వచ్చేస్తున్నారు. ఈ మధ్య సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న జానకి కలగనలేదు సీరియల్ ముగింపుకి వచ్చేయడంతో కొత్త సీరియల్ సిద్ధం చేస్తున్నారు. అదే “పలుకే బంగారమాయెనా”. భవిష్యత్తు ఎన్నో కలలను చూపిస్తుంది, ఎన్నో ఆశలను నేర్పిస్తుంది, ఏదో సాధించగలమన్న నమ్మకాన్ని ఇస్తుందని అంటున్నారు. ఈ కథతో స్టార్ మా ప్రారంభిస్తున్న సరికొత్త సీరియల్ “పలుకే బంగారమాయెనా” చూసేందుకు సిద్ధం అవుతున్నారు. రెండు కలిసి నడిచి నిజాలుగా మార్చుకున్న కథ ఇది, పుట్టుకతో పరాజితులే గానీ పట్టుదలతో ఇద్దరూ విజేతలుగా ఎలానిలబడ్డారు అనే విలక్షణ మైన కథ తో ఆగష్టు 21 నుంచి మ.1.30 గంటలకు స్టార్ మా ప్రేక్షకులను అలరించబోతోందని అన్నారు.

Balakrishna Fans: మాకేందిరా ఈ శిక్ష అంటున్న బాలయ్య ఫాన్స్

గెలుపే గమ్యమైన ఇద్దరి ప్రయాణంలో ఎన్ని మలుపులు, ఎన్ని మజిలీలు ఉంటాయో, ఎన్ని అవరోధాలు, అడ్డంకులు ఉంటాయో చెప్పిన ఇన్స్పిరేషనల్ స్టోరీ ఇది. ఏదో సాధించాలనే తపన ఉన్నా తన లోపం వల్ల ఆమె ముందడుగు చేయలేని నిస్సహాయ పరిస్థితి అయితే, ఆమె జీవితం లోకి అతని రాక ఒక మలుపు కాదు.. అనుకోని మజిలీ అని అంటున్నారు. అతని ప్రేమ, ప్రేరణ ఆమె ఆశయాన్ని ప్రతిక్షణం కంటికి రెప్పలా కాపాడాయని, పెంచి పెద్దచేసాయని అంటున్నారు. అతని సహాయ సహకారాలు ఈ అమ్మాయి అనుకున్న ఉన్నత స్థానానికి ఎలా తీసుకువెళ్లాయి అనేది “పలుకేబంగారమాయెనా” కథ అని చెబుతున్నారు. తడబడే అడుగుల నుంచి వడివడినడకలా వరకు ఒక జంట ఎంత అపురూపంగా ప్రయాణంచేసిందో అద్భుతంగా చెప్పిన ఈ సీరియల్ స్టార్ మా ప్రేక్షకులను ఉర్రూత లూగించబోతోందని అంటున్నారు. ఓడించాలనుకున్న జీవితాన్ని గెలుచుకున్న ఆ ఇద్దరు, వాళ్ళ కుటుంబాలు తెలుగు లోగిళ్ళలో ప్రతి కుటుంబానికి నచ్చుతాయని అంటున్నారు. సో ఈ సీరియల్ మిస్ అవ్వకండి.

Show comments