NTV Telugu Site icon

Pallavi Prashanth: పాపం పులిహోర బిడ్డ.. హౌస్ మేట్స్ లాజిక్స్ కి జావగారిపోయాడు!

Pallavi Prashanth

Pallavi Prashanth

Pallavi Prashanth Targetted by Bigg Boss 7 Telugu Contestants: బిగ్‏బాస్ 7 రసవత్తరంగా సాగుతూ పోతోంది. నేను రైతు బిడ్డను, రైతుల కష్టాలు అని అంటూ వీడియోలు చేసి బిగ్‏బాస్ దాకా వచ్చిన పల్లవి ప్రశాంత్ విన్నర్ అవుతానంటూ మొదటి రోజు నుంచి చెబుతున్నాడు. నిజానికి హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ రతిక మాయలో పడియి రోజంతా రతిక చుట్టే తిరుగుతున్నాడు. ప్రశాంత్ విషయంలో రతిక క్లారిటీగానే ఉన్నా ప్రశాంత్ మాత్రం ఆమె పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్న విషయం అర్ధ అవుతోంది. ఆమెతో ఎవరైనా మాట్లాడినా, క్లోజ్ గా మూవ్ అయినా తట్టుకోలేకపోతున్న ప్రశాంత్ ను మిగతా కంటెస్టెంట్స్ ఏడిపించేందుకు రతికతో క్లోజ్ గా ఉంటున్నట్లు కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మనోడు లోపల చేసే అతి, మాట్లాడితే రైతుబిడ్డ అని సింపతీ కోసం ప్రయత్నాలు చేసే వ్యవహారం చూస్తుంటే అందరికీ చిర్రెత్తుకొస్తోంది. కిందపడ్డ మెతుకులు ఏరుకుని తింటూ.. బిగ్ బాస్‌కి అన్నం తినిపిస్తూ పిచ్చి పిచ్చి డ్రామాలతో తన పరువు తానే తీసుకుంటున్న ప్రశాంత్ రైతు బిడ్డ కాదని పులిహోర బిడ్డ అని అతను నచ్చని వారు కామెంట్ చేస్తున్నారూ.

Sameera Sherief: రక్తమోడే ఫోటో షేర్ చేసిన నటి.. అసలు ఏమైంది?

ఇక ఇదిలా ఉండగా రెండోవారం నామినేషన్స్ లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ని ఒకేసారి నలుగులు కంటెస్టెంట్స్ నామినేట్ చేసి జావగార్చి పారేశారు. నిజానికి ఇక ఈ ప్రోమోలో.. గౌతమ్, ప్రియాంక జైన్, అమర్దీప్ చౌదరి, సింగర్ దామిని, షకీలా.. ఈ నలుగురు పల్లివి ప్రశాంత్‌ని నామినేట్ చేయడానికి రాగా ముందుగా షకీలా మాట్లాడుతూ వాడికి నేను ఎక్స్ ప్లేయిన్ చేయలేను బిగ్ బాస్ అని అంటూ నువ్వు ఎక్కువ కనిపించడం లేదని ఆమె తన రీజన్ చెప్పింది. ఇక మరో పక్క ‘నాకెంతమంది తోబుట్టువులో చెప్పరా? అని దామిని అడిగితే నాకేం తెలుసు అక్కా అక్కా? అని అడిగాడు పల్లవి ప్రశాంత్, దానికి ఆమె ‘నీకు ఓ అక్క ఇద్దరు తమ్ముళ్లు, ఆ విషయం హౌస్‌లో ఉన్న వాళ్లందరికీ తెలుసు ఎందుకంటే నీ గురించి నువ్వే మాట్లాడుకుంటావ్’ అని దామిని పంచ్ వేయడంతో ఓకే అక్కా అని అంటూ అక్క అని పిలిచినందుకు ఇలా అని దీర్ఘాలు తీశాడు. ఆ తరువాత గౌతమ్ ఒక ‘రైతు బిడ్డ..ఏం లేదు అని చెప్పుకోవడం నాకు నచ్చలేదు’ అని ఏదో చెప్పబోతుండగా.. ‘అవునన్నా.. నేను రైతు బిడ్డనే.. నేను చేసే పని గర్వంగా చెప్పుకుంటా? అది తప్పా అని ప్రశాంత్ ఫైర్ అయ్యాడు.

దీంతో మేం చెప్పేది విను నేను నీతోనే మాట్లాడుతున్న కదా విను అని ప్రియాంక జైన్ కూడా సీరియస్ అయింది. మళ్ళీ గౌతమ్ నువ్వు ఒక పోస్టు పెడితే నీకు లక్ష రూపాయలు ఇస్తారు అని అంటే ఆ లక్ష నేను తీసుకోనని ఒక నిరుపేద రైతు కుటుంబానికి ఇస్తానని అంటాడు. వెంటనే రంగంలోకి దిగిన అమర్ దీప్ లక్ష ఇస్తే.. రైతుకి ఇస్తానంటున్నావ్ కానీ. వాళ్ల ప్లేస్‌లో ఓ రిక్షా డ్రైవర్.. లారీ డ్రైవర్ ఉంటాడు.. వాళ్లకి ఇస్తానని చెప్పవే’ అంటూ ఆవేశంతో ఊగి పోయి మాట్లాడాడు. పల్లవి ప్రశాంత్ అప్పుడే పుష్పలో అల్లు అర్జున్ మాదిరిగా ఒక భుజం ఎత్తడంతో ‘భుజం దించు, భుజం దించు ‘నేను మాట్లాడుతున్నాను కదా భుజం దించు’ అంటూ అమర్ దీప్ అనడంతో అన్నా చలి పెడుతుంది? అని పల్లవి ప్రశాంత్ చెప్పుకొచ్చాడు. దీంతో అమర్ ‘ఇప్పుడు నువ్వు చూపిస్తున్న ఇదే బాడీ లాంగ్వేజ్‌తో అన్నా నేను బిగ్ బాస్‌కి వస్తా అని ఎందుకు చెప్పలేకపోయావో చెప్పరా? అంటూ పల్లవి ప్రశాంత్‌ను ఒక రేంజ్ లో ఆడుకున్నాడు అమర్ దీప్.

ఇక ఆ తరువాత రైతు కష్టమే కాదు బీటెక్ చదివినోడి కష్టాలు తెలుసారా నీకు?? చదివేసి ఏదో ఊరికి పోయి, ఏం జాబ్ చేస్తున్నామో తెలియక, తిండి తిప్పలు లేకుండా చచ్చిపోయిన వాళ్లు కూడా ఉన్నారు.. కనీసం శవాలు కూడా దొరకలేదు అలాంటి వాళ్లకి ఏం చెప్తావ్ అని ప్రశ్నించాడు. అంతేకాక అప్పుడు జావకారిపోయి మోకాళ్ళ మీద కూర్చుంటున్నట్టు పల్లవి ప్రశాంత్ చేయడంతో నువ్వు నా దగ్గర నటించకు.. నేను నీకంటే పెద్ద నటుడ్ని’ అంటూ అమర్ దీప్ ఫైర్ అయ్యాడు. ప్రతిదానికి నువ్వు రైతు అనే సెంటిమెంట్ డైలాగ్ వాడకు ప్రశాంత్ అని అమర్ ఊగిపోతుంటే, ‘ఆ డైలాగ్ ఎప్పుడు వాడాను అని పల్లవి ప్రశాంత్ అడిగాడు, దానికి ‘నువ్ వాడావ్.. నువ్ వాడావ్ రా’ అంటూ పూనకం వచ్చినట్టు ఊగిపోయాడు అమర్ దీప్.

అయితే పల్లవి ప్రశాంత్ కూడా ‘నీ సీరియల్ యాక్టింగ్ నా దగ్గర కాదు’ అని పల్లవి ప్రశాంత్ అంటే.. ‘నేను పుట్టుకతోనే నటుడ్ని.. నువ్వు నేర్చుకుని వచ్చిన నటుడువి అయ్యావ్’ అంటూ మళ్ళీ రెచ్చిపోయాడు అమర్ దీప్. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడూ రైతు బిడ్డే, మా తాతలు కూడా రైతులే అని ఆట సందీప్ తగులుకుంటే నేను ఆరో సీజన్‌కి నేను బిగ్ బాస్ స్టూడియో ముందు కుక్కలా తిరిగా అన్నా అని పల్లవి ప్రశాంత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే ప్రేయసి అనుకున్న రతిక ఎంట్రీ ఇచ్చి ‘మరి కుక్కలా తిగిగిన నీకు అవకాశం ఇస్తే.. ఇక్కడికొచ్చి ఏం చేస్తున్నావ్’ అని ప్రశ్నించే సరికి పల్లవి ప్రశాంత్ సైలెంట్ అయిపోయాడు. ఇక అదేదో జబ్బులా ఉందని గౌతమ్ అంటే దానికి మందులు ఉంటాయి గా వెళ్లేప్పుడు వేసుకుని వెళ్తానని పల్లవి ప్రశాంత్ చెప్పుకొచ్చాడు.

Show comments