NTV Telugu Site icon

Pallavi Prashanth: ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ వద్దన్నా.. నీ బండారం బయటపడిందిలే

Biggboss

Biggboss

Pallavi Prashanth: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7.. ఉల్టా ఫుల్టా. ఏ ముహూర్తాన ఇది అనౌన్స్ చేశారో కానీ.. అప్పటినుంచి ఇప్పటివరకు ఈ సీజ్ ట్రెండింగ్ లో నడుస్తూనే ఉంది. కంటెస్టెంట్ల దగ్గరనుంచి.. విన్నర్ వరకు నిత్యం గొడవలతో సాగింది. ఇక ఆ గొడవలన్నీ ఒక ఎత్తు అయితే.. పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాక జరిగిన గొడవ మొత్తం మరో ఎత్తు. పల్లవి ప్రశాంత్ విన్నర్ అని మొదటి నుంచి అందరూ అనుకుంటూనే వచ్చారు. గేమ్స్ బాగా ఆడుతున్నాడు.. కష్టపడుతున్నాడు అని ఓట్లు వేసి గెలిపించారు. రైతుబిడ్డగా లోపలి వెళ్లిన ప్రశాంత్.. బిగ్ బాస్ విన్నర్ గా బయటకి వచ్చాడు. బయటికి వచ్చినదగ్గరనుంచి ప్రశాంత్ బలుపు చూపిస్తున్నాడా.. ? అంటే అవును అనే మాటనే వినిపిస్తుంది. అమర్ డీప్ కారును ధ్వంసం చేసి.. అతడిపై దాడి జరిగినా ప్రశాంత్ పట్టించుకోలేదు. ఇంటికి వెళ్ళమని పోలీసులు వదిలేసినా.. వెనక్కి వచ్చి పోలీసుల మీదకే మాటలు విసిరాడు. పోలీస్ కేసు నమోదు చేస్తే.. రైతుబిడ్డపై నెగెటివిటీ చేస్తున్నారని చెప్పుకొచ్చాడు. ఇక యూట్యూబర్స్ కు ఇంటర్వ్యూలు ఇవ్వమని అడిగితే.. చాలాసేపు ఎదురుచూసేలా చేసి ఇవ్వను అని చెప్పినట్లు చాలామంది చెప్పుకొచ్చారు.

ఇక ఈ ఆరోపణలు అన్నింటికి పల్లవి ప్రశాంత్ సమాధానం చెప్పుకొచ్చాడు. తన పొలంలో కూర్చొని ఒక వీడియోను షేర్ చేశాడు. మొదటగా బిగ్ బాస్ హౌస్ కు పంపినందుకు.. విన్నర్ గా గెలిపించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పాడు. ఇక తనపై నెగెటివిటీ ని క్రియేట్ చేస్తున్నారు అని, తాను అందరికి ఇంటర్వ్యూలు ఇస్తాను అని చెప్పినట్లు తెలిపాడు. హౌస్ నుంచి బయటకు వచ్చాక ఏం తినలేదని, అందుకే నీరసంగా ఉండడంతో ఇంటికి వెళ్లి తిన్నాకా మాట్లాడతాను అని చెప్పినట్లు తెలిపాడు. దానికే అందరూ అపార్థం చేసుకున్నారు అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసాక అభిమానులు.. ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ వద్దన్నా.. నీ బండారం బయటపడిందిలే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి పల్లవి ప్రశాంత్ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి.