Site icon NTV Telugu

Pallavi prashanth: నా మీద కేసులు పెడితే పెట్టుకోనీ.. పల్లవి ప్రశాంత్ సంచలన వ్యాఖ్యలు

Pallavi Prashanth

Pallavi Prashanth

Pallavi prashanth Responds about Cases Registerd on him: బిగ్ బాస్ తెలుగు 7 టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై పలు కేసులు నమోదయ్యాయి. బిగ్ బాస్ తెలుగు 7 ఫినాలే ఆదివారం రాత్రి ముగిసింది. ‘రైతు బిడ్డ’ (రైతు కొడుకు) అని చెప్పుకునే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ పోటీలో విజయం సాధించి టైటిల్ విజేతగా నిలిచాడు, కానీ ఆ తర్వాత, ఊహించని సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో పల్లవి ప్రశాంత్‌పై పలు కేసులు నమోదయ్యాయి. ఇతర బిగ్ బాస్ పోటీదారులైన అమర్‌దీప్ మరియు అశ్విని శ్రీ వంటి వారి కార్లను అతని ఫాన్స్ గా చెబుతున్న వారు ధ్వంసం చేశారు. అలాగే అమర్‌దీప్‌, ప్రశాంత్‌ ఫాన్స్ ఘర్షణకు దిగారు. ఈ దుర్మార్గులు కొన్ని ఆర్టీసీ బస్సులను కూడా ధ్వంసం చేశారు. ఇక విజేతగా నిలిచిన ప్రశాంత్‌ను పోలీసులు తొలుత ఇంటికి పంపించారు. అయినప్పటికీ, అతను తన మద్దతుదారులతో అన్నపూర్ణ స్టూడియోస్‌కు తిరిగి వచ్చాడు.

Tollywood : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని క‌లిసిన సినీ పెద్దలు

ఈ క్రమంలో నిబంధనలు పాటించకుండా, చట్ట వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించడం వల్ల చాలా సమస్యలు తలెత్తడంతో పోలీసు అధికారులు అతనిపై చాలా సీరియస్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలో పల్లవి ప్రశాంత్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. 147, 148, 290, 353, 426, మరియు 149 సెక్షన్ల కింద ప్రశాంత్, అతని అనుచరులపై కూడా కేసులు పెట్టారు. ఇక ఈ క్రమంలో ఈ కేసుల గురించి ప్రశించగా దానికి ప్రశాంత్ స్పందిస్తూ అక్కడ ఎంత మంది వచ్చారో నాకు తెలియదు, నన్నే చాలా సేపు ఉంచి బ్యాక్ గేట్ నుంచి పంపితే నేను చాలా సేపు ఉండి మళ్ళీ వచ్చా. అప్పుడు పోలీసులు మా వాళ్ళ మీద లాఠీ ఛార్జ్ చేశారు. మా వాళ్ళు ఎవరూ ఏమీ ద్వంశం చేయలేదు, నన్నే వెనుక డోర్ నుంచి పంపారు. పోలీసులు పర్మిషన్ ఇవ్వడం లేదని అక్కడి టీమ్ నాకు చెప్పిందని అన్నారు. ఇక కేసులు సంగతి తెలుసా అని అడిగితే నామీద పెడితే పెట్టుకోనీ నేనేమైనా చేస్తే కదా నా మీద పెట్టనీకి అని ప్రశ్నించారు. ఒకడు పండించిన పంట ఎండిపోతే వాడు బాధ పడతాడు కానీ ఎవడిమీదో వేస్తానంటే ఎలా అని ప్రశాంత్ ప్రశ్నిస్తున్నాడు.

Exit mobile version