Pallavi Prashanth parents Emotional Comments at Bigg Boss 7 Telugu Grand Finale: ‘బిగ్ బాస్’ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే లైవ్ 7 గంటల నుంచి ప్రసారం అవుతోంది. నిన్న షూట్ చేసిన కంటెంట్ ను ఈరోజు టెలికాస్ట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు నాగార్జున 10 గంటలకు విజేతను ప్రకటించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇక ఈ బిగ్ బాస్ 7 స్టేజ్ మీద ఒక పక్క ఎలిమినేట్ అయిన వారి డాన్సు పర్‌ఫెర్మెన్స్ లే కాదు, హౌజ్‌లో టాప్ 6 లో ఉన్న హౌజ్ మేట్స్ కూడా డాన్సు పర్‌ఫెర్మెన్స్ లతో ఉర్రూతలూగించారు. ఇక యావర్, శివాజీ, ప్రియాంక, పల్లవి ప్రశాంత్, అర్జున్, అమర్ దీప్‌లు తమదైన పాటలతో డాన్సులు చేసి మెప్పిస్తూ ఫినాలేకి మరింత ఊపు తీసుకొచ్చారు. అయితే ఈ సీజన్ విన్నర్ అని ప్రచారం జరుగుతున్న పల్లవి ప్రశాంత్ గురించి కాకినాడ, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి జనాలు వస్తున్నారని ఆయన తండ్రి చెప్పారు.
Bigg Boss 7 Telugu Grand Finale: బిగ్ బాస్ 7 నుంచి బయటకు వెళ్ళాక లైఫ్ మారిపోయింది!
ఒక పక్క తమ పనులు ఆగిపోతున్నా.. తమ అబ్బాయిపై వారు ప్రేమ చూపుతున్నారనేది తమకు ఆనందం కలిగిస్తోందని ఆయన అన్నారు.. ముందు తాము ఎవరికీ తెలియమని, ఇప్పుడు తాము లక్షల మందికి తెలిశామని ఆనందం వ్యక్తం చేశారు పల్లవి ప్రశాంత్ పేరెంట్స్, తమకు ఇది ఏమీ తెలియదని, ఇప్పుడు తమని చూసేందుకు అందరూ వస్తున్నారని, పొలం పనులు చేసుకోనివ్వడం లేదని వెల్లడించారు. అంతేకాదు ఇంత పేరు రావడం ఆనందంగా ఉందని వారు ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఇక ఇక తాను ఒక సీక్రెట్ చెప్పబోతున్నా అని అంటూ 3 నెలల కిందనే బిగ్ బాస్ ఆఫర్ వచ్చినట్లు వెల్లడించారు. శివాజీ వెళ్లను అంటే రివర్స్‌లో నువ్వు వెళ్లలేవు, ఆడలేవు అన్నా, అందుకే, పట్టుదలతో నాన్న బిగ్ బాస్‌కు వెళ్లారని శివాజీ చిన్న కొడుకు చెప్పాడు.
