Site icon NTV Telugu

Pallavi Prashanth: రతిక మా వాడిని వాడుకుంది.. బయటకు రాగానే పెళ్లి చేస్తాం.. పల్లవి ప్రశాంత్ తల్లి షాకింగ్ కామెంట్స్

Pallavi Prashanth Mother

Pallavi Prashanth Mother

Pallavi Prashanth Mother Shocking Comments on Rathika: బిగ్ బాస్ సీజన్ 7 మొదలైనప్పటి నుంచే పల్లవి ప్రశాంత్ పేరు బాగా వినిపిస్తోంది. రైతుబిడ్డగా కామన్ మ్యాన్ కోటాలో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతున్నాడు. హౌస్ లో మొదటి వారం రతికతో లవ్ ట్రాక్ వల్ల ప్రశాంత్ పేరు బాగా వినిపించగా మనోడి ఓవర్ యాక్షన్ తో హౌస్ మేట్స్ అందరూ అతన్ని టార్గెట్ చేశారు. అయితే అలా చేయడంతో ఆడియన్స్ అంతా ప్రశాంత్ పై ఇప్పుడు సింపతి చూపిస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా పల్లవి ప్రశాంత్ తల్లిదండ్రులు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన వ్యాఖలు చేస్తున్నారు. ప్రశాంత్ తల్లి మాట్లాడుతూ ప్రశాంత్ బిగ్ బాస్ నుంచి తిరిగి వచ్చాక పెళ్లి చేస్తామని వెల్లడించారు. తన కొడుకు బిగ్ బాస్ లోకి వెళ్లడానికి ఎంతోమంది సపోర్ట్ చేశారని, అందరూ సపోర్ట్ చేయడం వల్ల తన కొడుకు ఇప్పుడు హౌస్ లో ఉన్నాడని ప్రశాంత్ తల్లి చెప్పుకొచ్చారు.

Salaar OTT: ఇందుకే కదా డైనోసర్ రేంజ్ ఎలివేషన్లు ఇచ్చేది?

నాకు ఆరోగ్యం మంచిగా లేదు పెళ్లి చేసుకో బిడ్డ, కోడలైన ఇంట్లో పని చేస్తది, నాకు అసలు చేతకావడం లేదని చెబితే, అమ్మ నేను ఇంత కష్టపడ్డా సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటా, అప్పటివరకు నువ్వు పెళ్లి ముచ్చట మాట్లాడకని అన్నాడని ఆమె అన్నారు. ఇక హౌస్ లో రతికతో కలిసి ఉంటున్నాడు, కలిసి తింటున్నాడు కదా దాని గురించి ఏమంటారని అడిగితే ఆమె మా కొడుకుని వాడుకుందని ప్రశాంత్ తల్లి అన్నారు. నేను పల్లవి ప్రశాంత్‌తో ఉంటే ఆయనకు వచ్చే ఓట్లు కూడా నాకు వస్తాయని వాడుకుంది, అంతే తప్ప వేరే ఏం లేదని ఆమె అన్నారు. మా కొడుకు కూడా అందరిని అక్కా, చెల్లె అనే ఉద్దేశంతోనే చూస్తాడని, ఇక ఇంట్లో ఎలా ఉంటున్నాడో హౌస్ లో కూడా అలాగే ఉంటున్నాడని ఆమె అన్నారు. మా కొడుకు బిగ్ బాస్ లో గెలిచినా, గెలవకున్నా అక్కడిదాకా వెళ్లి నాగార్జున సార్ ని కలవడం మాకు గొప్ప అని పల్లవి ప్రశాంత్ తల్లి చెప్పుకొచ్చారు.

Exit mobile version