Pallavi Prashanth About His Political Entry: ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో హడావుడి చేసే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ పుణ్యమా అని ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయాడు. రైతు బిడ్డగా లోపలికి కామన్ మ్యాన్ లా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ తన ఆట, మాట తీరుతో అందరి మనసులు గెల్చుకుని ఆ సీజన్ లో ఉన్న టాప్ సెలబ్రిటీలను దాటేసి బిగ్ బాస్ విజేతగా నిలిచాడు. అయితే ఆ తర్వాత జరిగిన సంఘటనలతో అరెస్ట్ కావడం, జైలుకు వెళ్లడం, విడుదల కావడంతో సైలెంట్ అయ్యాడు. ఇక ఈమధ్య తన బిగ్ బాస్ ఫ్రెండ్ ప్రిన్స్ యావర్ హీరోగా చేసిన ఒక సాంగ్ ఈవెంట్ కు వైట్ అండ్ వైట్ లో హాజరయ్యాడు. దీంతో పొలిటికల్ ఎంట్రీ కూడా ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అంతేకాక రైతులు అందరికీ సహాయం చేయాలంటే తనను సీఎంని చేయమని కామెంట్ కూడా హాట్ టాపిక్ అయింది.
Mangli: ఆ పుకార్లు నమ్మకండి.. యాక్సిడెంట్‌పై మంగ్లీ కీలక వ్యాఖ్యలు
ఇక ఈ క్రమంలో నిజంగా పాలిటిక్స్ మీద ఆసక్తి ఉందా అని అడిగితే రైతుల కోసం ప్రజల ఆశీసులు ఉంటే ఎంతదూరమైనా వెళ్తానని చెప్పుకొచ్చాడు. అంతేకాక పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ అప్పుడు సీఎం అంటూ చేసిన కామెంట్ల గురించి చెప్పుకొచ్చాడు. ఇవన్నింటిని ఆదుకోవాలంటే నన్ను సీఎం చేస్తే ఆదుకుంటా అని చెప్పిన… అది తప్పా.. అంతే కదా.. అందరినీ ఆదుకునే దమ్మంటే సీఎంకే ఉంటుంది. 14 వేల మందిని అంటే మామూలు ముచ్చటనా? నాకు వచ్చింది ఎంత? రూపాయి వచ్చిందనుకోండి.. రూపాయిని 14వేల మందికి ఎలా పంచుతా? అని ప్రశ్నించాడు. మళ్లీ ఇచ్చినా.. ఇంతే ఇచ్చుండు అనే పేరు, అట్లా కాకుండా డైరెక్ట్ సీఎం చేస్తే అందరినీ, ఆదుకుంటా.. యువత మేల్కోవాలి.. ఇప్పటికైనా యువత ముందుకు వస్తే రైతులు బాగుపడుతారు, యువత ముందుకు రావాలి.. రైతులను ఆదుకోవాలి అని ప్రశాంత్ కామెంట్ చేశాడు.