Site icon NTV Telugu

Akkineni Nagarjuna: పాకిస్థాన్ లో నాగార్జున.. నెలకు లక్షల్లో సంపాదన..?

Nag

Nag

Akkineni Nagarjuna: పాకిస్థాన్ లో నాగార్జున ఏంటి.. లక్షల్లో సంపాదించడం ఏంటి.. ఆయన ఇండియాలోనే ఉన్నారుగా అని డౌట్ పడకండి. అవును.. మన నాగార్జున ఇండియాలోనే ఉన్నారు. అయితే అచ్చు గుద్దినట్లు నాగార్జునలా ఉండే వ్యక్తి మాత్రం పాకిస్థాన్ లో ఉన్నాడు. ఉండడమే కాదు. నాగ్ లా మేకప్ వేసుకొని యూట్యూబ్ వీడియోలు చేస్తూ.. నెలకు లక్షలు గడిస్తున్నాడు. ఈ మధ్య హీరోలను పోలిన వ్యక్తులు వారిలా మేకప్ వేసుకొని రీల్స్ చేసి సెలబ్రిటీలుగా మారుతున్న విషయం తెల్సిందే. అలానే నాగ్ లాంటి వ్యక్తి పాకిస్థాన్ లో కనిపించాడు. అతడి పేరే.. జైన్ అక్మ‌ల్ ఖాన్. టీనేజ్ వయసు నుంచి అతను నాగార్జునలా ఉన్నాడట. చాలామంది జైన్ ను చూసి.. ఇండియన్ హీరోలా ఉన్నావు అంటూ కామెంట్స్ చేసేవారట.

ఇక సోషల్ మీడియా వచ్చాకా.. అతను షికారీ మాస్ పేరుతో ఒక పుడ్ వ్లాగ్ ను మొదలుపెట్టాడు. అయితే ఈ వీడియోలు చూసిన కొంతమంది ఇండియన్స్.. నాగార్జునలా ఉన్నావ్ అని చెప్పడంతో.. అసలు నాగ్ ఎవరో తెలుసుకొనే ప్రయత్నం చేశాడట జైన్. అక్కినేని నాగార్జున ఇండియన్ హీరో అని, అతనికి ఒక సపరేట్ స్టైల్ ఉందని తెలుసుకొని.. నాగ్ లానే రెడీ అయ్యి.. ఆయన స్టైల్ లోనే మాట్లాడడం మొదలుపెట్టాడట. ఇక అలా చేసినదగ్గరనుంచి వీడియోస్, వ్యూస్ పెరిగి యూట్యూబ్ లో సంపాదన బాగా వస్తుందంట. ప్రస్తుతం ఈ యూట్యూబర్.. నెలకు దాదాపు మూడు నాలుగు లక్షల వరకు సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం జైన్ కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version