Pakistani Cinema: నెట్‌ఫ్లిక్స్‌తో భాగస్వామ్యానికి పాకిస్తాన్ ప్రయత్నాలు.. గ్లోబల్ స్ట్రీమింగ్పై ఫోకస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistani Cinema: ఒకప్పుడు లోకల్ కే పరిమితమైన పాకిస్తానీ సినీ రంగం ఇప్పుడు ప్రపంచ మార్కెట్‌పై దృష్టి పెట్టింది. డిజిటల్ స్ట్రీమింగ్ లో ప్రాంతీయ కంటెంట్‌కు పెరుగుతున్న ఆదరణను అవకాశంగా మార్చుకోవాలని భావిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వం, తమ సినిమాలు, టెలివిజన్ ధారావాహికలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు మరింతగా చేరవేయడానికి కీలక అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ప్రపంచ ప్రఖ్యాత స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ప్లాట్ ఫామ్ తో చర్చలు జరుగుతున్నాయని అధికారికంగా వెల్లడించడం ఆసక్తిగా మారింది.
పాకిస్తాన్ ప్రణాళిక అభివృద్ధి కార్యక్రమాల శాఖ మంత్రి అహ్సాన్ ఇక్బాల్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఎక్స్‌లో చేసిన పోస్టులో ఆయన పాకిస్తానీ సినిమాలు, డ్రామాలను సాటిలేనివిగా అభివర్ణించారు. దక్షిణాసియా దేశాలతో పాటు గల్ఫ్ దేశాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాకిస్తానీ ప్రవాసుల మధ్య తమ దేశ కంటెంట్‌కు పెరుగుతున్న ఆదరణను ప్రస్తావిస్తూ, “ఉరాన్ పాకిస్తాన్” కార్యక్రమంలో భాగంగా వినోద రంగాన్ని కీలక పరిశ్రమగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు.
Also Read
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
- Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి అంతర్జాతీయ ఓటీటీ వేదికలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులను చేరుకునే మార్గాలుగా ఉన్నాయని, అయితే ప్రాంతీయ రాజకీయ పరిస్థితులు, మార్కెట్ పరిమితులు వంటి కారణాల వల్ల పాకిస్తానీ కంటెంట్‌కు తగిన అవకాశాలు లభించడం లేదని ప్రభుత్వం భావిస్తోందని అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ఓటీటీ వేదికలతో చర్చలు జరుపుతున్నామని, ప్రపంచ స్ట్రీమింగ్ మార్కెట్లో పాకిస్తాన్ కూడా సముచితమైన స్థానం సంపాదించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పుకొచ్చారు.
ఇంతటితో ఆగకుండా, పాకిస్తాన్ తన సొంత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను కూడా అభివృద్ధి చేసే పనిలో ఉంది. ఈ స్వదేశీ స్ట్రీమింగ్ ద్వారా దేశీయ ప్రేక్షకులతో పాటు విదేశాల్లోని పాకిస్తానీ ప్రవాసులకు స్థానిక సినిమాలు, డ్రామాలు, ఒరిజినల్ వెబ్ కంటెంట్‌ను ఒకే వేదికపై అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ ప్లాట్‌ఫామ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది, దాని నిర్వహణ ఎలా ఉంటుంది, ఎంత బడ్జెట్ కేటాయించనున్నారు వంటి అంశాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరాలు వెల్లడించలేదు.
అలాగే నెట్‌ఫ్లిక్స్‌తో జరుగుతున్న చర్చలు ఏ దశలో ఉన్నాయనే విషయాన్ని కూడా ప్రభుత్వం స్పష్టం చేయలేదు. మరోవైపు నెట్‌ఫ్లిక్స్ సంస్థ కూడా పాకిస్తాన్ ప్రభుత్వంతో ఎలాంటి భాగస్వామ్య ఒప్పందం కుదిరిందని ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. గతంలో కొన్ని పాకిస్తానీ డ్రామాలు లైసెన్సింగ్ ఒప్పందాల ద్వారా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైనప్పటికీ, ఆ దేశానికి చెందిన ఒరిజినల్ ప్రొడక్షన్లకు పెద్దగా అవకాశాలు లభించలేదు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఈ ప్రయత్నాలు విజయవంతమైతే పరిస్థితి మారే అవకాశముంది. అంతర్జాతీయ ఓటీటీ మార్కెట్లో పాకిస్తానీ కథలకు గుర్తింపు వచ్చే అవకాశం ఉంది.
- Tags
- cinema
- netflix
- Pakistan OTT
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!