NTV Telugu Site icon

Hanuman: హనుమాన్ ను వీక్షించిన పద్మ విభూషణ్ వెంకయ్య నాయుడు.. ఏమన్నారంటే..?

Venky

Venky

Hanuman: తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. భార‌తీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో ఇండియన్ తొలి ఒరిజినల్‌ సూపర్‌హీరో మూవీగా ఈ సినిమాను తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయ్యి ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ చిత్రం వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ.210 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఈ సినిమా చూసిన అందరూ తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కేవలం హనుమాన్ సినిమా చూసిన ప్రేక్షకులే కాదు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక తాజాగా పద్మ విభూషణ్ వెంకయ్య నాయుడు ఈ సినిమాను వీక్షించి.. తనదైన పద్దతిలో రివ్యూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారు.

“హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోస్ లో సోమవారం హనుమాన్ చలనచిత్రాన్ని స్నేహితులతో కలిసి వీక్షించాను. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. భారతీయ ఇతిహాస వీరుల్లో ఒకరైన శ్రీ ఆంజనేయస్వామి స్ఫూర్తిగా తెరకెక్కించిన ఈ చిత్రం లోని ప్రతిఘట్టం ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు, గ్రాఫిక్స్ ఉన్నతంగా ఉన్నాయి. తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, ఇతర నటుల నటన ఆకట్టుకుంది. నిర్మాత నిరంజన్ రెడ్డి గారికి, దర్శకుడు ప్రశాంత్ వర్మ కు, చిత్ర నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి అభినందనలు” అని తెలిపారు. ఇక వెంకయ్య నాయుడు ప్రశంసలకు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ థాంక్స్ చెప్పాడు. ” నాకు చాలా సంతోషంగా ఉంది.. ఎంతో గౌరవంగా ఉంది. మీరు మా సినిమా గురించి మాట్లాడం. హనుమాన్ వంటి చిత్రాలను రూపొందించడం, కొనసాగించడానికి మీ మాటలు నమ్మశక్యం కాని విధంగా ప్రేరేపిస్తాయి మరియు మాకు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి.ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్‌ను వరించినందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు సార్. ఇది నిజంగా సమాజానికి మీరు చేసిన విశేషమైన కృషికి తగిన గౌరవం” అని తెలిపాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.