NTV Telugu Site icon

Padma Awards 2024: నేడే పద్మ అవార్డుల ప్రకటన.. మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్?

Chiranjeevi

Chiranjeevi

Padma Vibhushan may be announced to Megastar Chiranjeevi: ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవానికి ఒక్కరోజు ముందు అంటే జనవరి 25వ తేదీన పద్మ అవార్డులు ప్రకటిస్తూ ఉంటారు. ఈ ఏడాది కూడా ఈరోజు సాయంత్రం పద్మ పురస్కారాలకు సంబంధించి ఎంపికైన వారి పేర్లు అధికారికంగా ప్రకటిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈసారి ఈ అవార్డుల ప్రకటన తెలుగు సినిమా ప్రేక్షకులకు మాత్రం ప్రత్యేకంగా ఉంటుందని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది ప్రకటించబోయే పద్మ పురస్కారాలలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారంగా భావించే పద్మ విభూషణ్ వరించబోతుందని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. గత కొన్నాళ్లుగా ఢిల్లీ వర్గాల్లో కూడా ఇదే ప్రచారం జరుగుతూ ఉండడంతో దాదాపు ఆయన ప్రకటించడం ఇక లాంచనం మాత్రమే అని తెలుస్తోంది. నిజానికి మెగాస్టార్ చిరంజీవి ఒక హీరో గానే కాక సమాజ సేవకుడిగా కూడా గుర్తింపు పొందారు.

Pindam OTT: థియేటర్లలో వణికించిన ‘పిండం’ ఇప్పుడు మీ ఇంటికే వచ్చేస్తోంది.. ఎందులో చూడాలంటే?

సుమారు 155 సినిమాలక పైగా హీరోగా చేసిన ఆయన ఎంతోమందికి ఆదర్శప్రాయం కూడా. ఒకపక్క తెలుగు సినీ పరిశ్రమకు మరొక పక్క తెలుగువారికి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా 2006లో భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఇక ఇప్పుడు ఆయనని పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయనకు సమాచారం అందినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. కానీ ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది. ప్రస్తుతానికి మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరా అనే సినిమా చేస్తున్నారు బింబిసార డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అటు మెగా అభిమానులు మాత్రమే కాదు సినీ అభిమానులందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. జగదేకవీరుడు అతిలోకసుందరి తర్వాత అలాంటి కథలు ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవి చేయలేదు ఇది దాదాపు అలాంటి కథనే అని తెలియడంతో అందరూ ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి కనబరుస్తున్నారు.