Chiranjeevi: టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు.. నన్ను ఫాలో అవ్వకపోయినా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ఆపరేషన్ వాలంటైన్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న తొలి తెలుగు చిత్రం ఇదే. దీనితో ఈ మూవీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 1న రిలీజ్ కి రెడీ అవుతోంది.ఈ చిత్రంలో మాజీ ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ వరుణ్ కి జోడిగా నటిస్తోంది. ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ అంటే విజువల్ ఎఫెక్ట్స్ కి ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేశారు.
ఇక ఈ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. ” అందరికీ నమస్కారం. మరి ముఖ్యంగా మా కుటుంబంలో ఏ ఈవెంట్ జరిగినా కూడా అది తమ ఇంట్లో ఫంక్షన్ లాగా ఉరకలైతే ఉత్సాహంతోటి ముందుకొస్తూ మమ్మల్ని ఉత్సాహ పరుస్తూ మా అభిమానులకు ఎప్పటిలాగే శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను ఎప్పటికప్పుడు మీరు చూపించే ఉత్సాహమే మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది నేను నాలుగు ఐదు రోజుల క్రితం అమెరికాలో ఉన్నాను అక్కడికి ఒక మెసేజ్ వచ్చింది వరుణ్ తేజ్ నుంచి నడి నీతో ఏదో మాట్లాడాలి అని అప్పట్లో నైట్ టైమింగ్స్ కుదరకపోవడంతో సరిగా మాట్లాడలేదు జనరల్ గా వరుణ్ ఎప్పుడు మెసేజ్ పెట్టడు. అనుకుంటే వచ్చేస్తాడు.. మూడు రోజుల తర్వాత వరుణ్ నేను అమెరికా నుండి వచ్చాక మళ్ళీ కాల్ చేశాడు. ఏమైందో తెలియక ఇంటికితా అని పిలిచాను. నా సినిమా ఫంక్షన్ జరుగుతుంది. నువ్వు ముఖ్య అతిథిగా రావాలి.. నాకు తెలుసు నిన్ను బయట వాళ్ళు పిలుస్తారు. నువ్వు వెళుతుంటావు.. కొంతవరకు ఇబ్బంది ఉంటుంది. కానీ, ఈసారి కంపల్సరిగా రావాలి. నేనెప్పుడూ అడగలేదు. ముకుంద తర్వాత ఇప్పటివరకు నా ఫంక్షన్ కి రాలేదు. ఈ ఈవెంట్ కి నువ్వే రావాలి ఎందుకంటే నీలాంటి వ్యక్తి బోర్డర్స్ లో ఫైట్ చేసిన హీరోస్ మీద సినిమా చేస్తున్నప్పుడు దాని గురించి పదిమందికి తెలిసేలాగా, పదిమంది మోటివేట్ అయ్యేలాగా మీరు కనుక ఆ ఫంక్షన్ లో పార్టిసిపేట్ చేస్తే ఆ రీచ్ వేరుగా ఉంటుంది అని చెప్పగానే.. ఇది గొప్ప అవకాశం నేను రావడం వాడికి అవకాశం కాదు.. ఇలాంటివి గొప్ప సినిమా గురించి గొప్ప హీరోల గురించి మన బోర్డర్లో ఉండే సైనికుల గురించి ఇలాంటి సినిమా తీసినప్పుడు వారి గురించి మాట్లాడడానికి నాకు వచ్చిన గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను. ఈ ఫంక్షన్ కి రావడం అనేది నాకు నిజంగా గర్వంగా ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు నేను అనుకున్నది ఏంటంటే పుల్వామా దాడిలో 40 మంది చనిపోవడం చూశాం. ఇందాక సినిమాలో సాంగ్ చేసినప్పుడు నాకు ఆ దాడే గుర్తొచ్చింది. ఎంతో హృదయ విదారకంగా ఇప్పించింది అలాంటి వారిపై రివెంజ్ తీసుకుని సాహసమే ఈ సినిమా వాలంటీర్ అని టైటిల్ పెట్టినప్పుడు ఏంటి వరుణ్ ఈ సినిమాలో రొమాన్స్ కూడా ఉందా అని అడగగా లేదు డాడీ ఫిబ్రవరి 14న ఈ సర్జికల్ స్ట్రైక్ జరిగింది కాబట్టి దానికి సినిమా పరంగా మేము పెట్టుకున్న పేరు ఆపరేషన్ వాలెంటైన్ అని చెప్పాడు.
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
ఇక ఈ సినిమాలో నటించంవారందరూ చాలా టాలెంట్ ఉన్నవారు. వరుణ్ గురించి చెప్పాలంటే.. చిన్నప్పుడు అందరం ఒకేచోట తిన్నాం, ఒకేచోట పడుకున్నాం. వాళ్ళ జీవితమంతా నాతోనే. అయితే వాళ్లు ఏది అవ్వాలనుకుంటున్నారో అది నేను అవ్వనివ్వకుండా చేసేనేమో.. నా ఇంట్లో మేకప్ వేసుకుంటూ.. సినిమాలు చూస్తూ.. నాలాగే అయ్యేలా వారిని ప్రేరేపించానేమో.. వాళ్ళు చదువు అయ్యాక.. యాక్టర్ కాక ఇంకేం చేస్తాం అనుకున్నారేమో.. నా దగ్గర చెప్పీచెప్పగానే.. నేను ఒప్పేసుకున్నాను. ఎందుకంటే.. ఫిల్మ్ ఇండస్ట్రీ బెస్ట్ ఇండస్ట్రీ. నేను చాలా గౌరవిస్తాను .. మన కళామ్మ తల్లి అని భావిస్తాను. మనం ఎంత గౌరవిస్తే.. అంతగా ఫిల్మ్ ఇండస్ట్రీ అంతగా అక్కున చేర్చుకుంటుందని బలంగా నమ్మాను. వరుణ్.. నన్ను ఇన్సఫిరేషన్ గా తీసుకున్నాడా.. వేరేవాళ్లను తీసుకున్నాడా తెలియదు కానీ, నన్ను మాత్రం ఎప్పుడు ఫాలో కాలేదు. అది మంచి విషయం. డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్.. మెగా హీరోల్లోనే ఎవరు చేయలేని సినిమాలు వరుణ్ చేశాడు. తన కెరీర్ లో ఈ 13 సినిమాలు చాలా డిఫరెంట్.. అలాంటి కథలను ఎంచుకొని సక్సెస్ ఫుల్ గా వచ్చి ఈ స్టేజిపై నిలబడ్డాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో వచ్చిన మొదటి సినిమా ఇది.. ఈ మధ్య టాప్ గన్ సినిమా చూసాను.. అలాంటి సినిమాను మనోళ్లు ఎంతో ఈజీగా తీశారు అంటే టాలెంట్ అనేది ఎవడబ్బా సొత్తు కాదు. మనం కూడా ఆ స్థాయిలో ఉన్నామని చూపించారు. అందుకే ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను” అంటూ ముగించారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!