Site icon NTV Telugu

ఎనిమీ : “పడదే” లిరికల్ వీడియో సాంగ్

Padathe Lyric Video Song from Enemy

కోలీవుడ్ స్టార్స్, స్నేహితులు విశాల్, ఆర్య ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ “ఎనిమీ”. తమన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ పెప్పీ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. “పడదే” అంటూ సాగిన ఈ లిరికల్ వీడియో సాంగ్ సరికొత్త ట్యూన్స్ తో ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం నుంచి విడుదలైన మొదటి సాంగ్ ఇదే. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. వివేక్ సాహిత్యం అందించిన ఈ సాంగ్ ను పృధ్వీ చంద్ర పాడారు. ఈ సాంగ్ ను ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేశారు. హీరోహీరోయిన్ల మధ్య ఈ సాంగ్ ఉండబోయే ఈ రొమాంటిక్ సాంగ్ బాగుంది.

Read Also : గ్లింప్సె : “భీమ్లా నాయక్” బ్రేక్ టైం… మోత మోగాల్సిందే

గతంలో బాలా రూపొందించిన “వాడు-వీడు” సినిమాలోవిశాల్, ఆర్య కలిసి నటించి బాక్సాఫీస్‌ని షేక్ చేశారు. ఇప్పుడు మరోసారి విశాల్, ఆర్య కలిసి నటిస్తున్న సినిమా ‘ఎనిమీ’. యాక్ష‌న్ హీరో విశాల్ కు ఇది 30వ చిత్రం కాగా, ఆర్య‌కు 32వ సినిమా. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న “ఎనిమీ” త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version