Site icon NTV Telugu

Paayal Rajput: ఇదేం పని ఇండిగో? నీవల్ల అది మిస్సయ్యా.. పాయల్ ట్వీట్ వైరల్

Payal

Payal

Paayal Rajput Fires on Indigo for Continues Delays: ఒక్కో సారి విమాన ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఫ్లైట్స్ డిలే అవుతూ ఉంటాయి. ఇది ఎక్కువగా విమాన ప్రయాణాలు చేసే వారందరికీ దాదాపుగా అనుభవం అవుతూనే ఉంటుంది. తాజాగా మాత్రం హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కి ఇలాంటి అనుభవం అవడంతో ఆమె సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా తన ట్విట్టర్ సోషల్ మీడియా ఖాతా ద్వారా పాయల్ రాజ్ పుత్ ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ మీద విరుచుకు పడింది. ఆదివారం నాడు ఇండిగో సంస్థ వ్యవహారం ఏ మాత్రం బాలేదని ఆమె పేర్కొంది.

Mahesh Babu: కూతురుతో సూపర్ స్టార్.. భలే ముద్దుగా ఉన్నారే

ఆ రోజు వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చే ఫ్లైట్ రెండు గంటలు డిలే అయిందని, ఆ కారణంగా హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లాల్సిన తన కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అయ్యానని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఆ ఫ్లైట్ మిస్ అవ్వడంతో నిన్న హైదరాబాద్ ముంబై ఫ్లైట్ బుక్ చేసుకుంటే, దానికి కూడా రెండు గంటలు డిలే అని చెప్పారని ఈరోజు మరో ఫ్లైట్ కి వెళ్లాల్సి ఉంటే అది కూడా రెండు గంటలు డిలే అని చెబుతూ తనకు కాల్ చేశారని ఆమె పేర్కొన్నారు. ఇలా వరుసగా లేట్ చేస్తూ రావడం వల్ల తను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ మిస్ అయ్యానని, ఈ విషయాన్ని పట్టించుకుని పద్దాక డిలే అవకుండా చూసుకోకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె రాసుకొచ్చింది. చాలా కాలం తర్వాత పాయల్ రాజ్ పుత్ మంగళవారం అనే సినిమాతో హిట్ అందుకుంది. ఈ సినిమా త్వరలోనే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది.

Exit mobile version