Site icon NTV Telugu

Pa Pa: అమ్మాయి అబ్బాయి మధ్యలో అవసరాలా…

Pa Pa

Pa Pa

యంగ్ హీరో నాగ శౌర్య, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న సినిమా ‘ఫలానా అబ్బాయ్-ఫలానా అమ్మాయి’. మార్చ్ 17న రిలీజ్ కానున్న ఈ మూవీని అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ మూవీ ట్రైలర్ ని మేకర్స్ లాంచ్ చేశారు. గ్రాండ్ గా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో ‘ఫలానా అబ్బాయ్-ఫలానా అమ్మాయి’ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. సీనియర్ అమ్మాయి, జూనియర్ అబ్బాయి మధ్య మొదలైన ప్రేమ కథ ఎన్ని మలుపులు తిరిగింది అనేదే చిత్ర కథగా కనిపిస్తోంది. అయితే ఈ అమ్మాయి అబ్బాయి మధ్య అవసరాల శ్రీనివాస్ కూడా స్పెషల్ రోల్ ప్లే చేసినట్లు ఉన్నాడు. ‘ఫలానా అబ్బాయ్-ఫలానా అమ్మాయి’ సినిమాలోని మలుపులు, మజిలీలు శ్రీనివాస్ క్యారెక్టర్ నుంచే పుట్టినట్లు ఉన్నాయి.

Read Also: Naatu Naatu Song Oscar Academy Awards 2023 LIVE: ఆస్కార్ కు అడుగు దూరంలో..

ఊహలు గుసగుసలాడే సినిమాలో కూడా రాశీ ఖన్నా, నాగ శౌర్య క్యారెక్టర్స్ మధ్య క్యూట్ లవ్ జరుగుతుంది అనే ఫీలింగ్ రాగానే అవసరాలా శ్రీనివాస్ క్యారెక్టర్ వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా అచ్చం అలాగే మాళవిక నాయర్, నాగ శౌర్యల లవ్ స్టొరీలోకి అవసరాలా వచ్చేసాడు. అయితే ఊహలు గుసగుసలాడే సినిమాలో అవసరాల వస్తే మంచి ఫన్ వర్కౌట్ అయ్యింది మరి ‘ఫలానా అబ్బాయ్-ఫలానా అమ్మాయి’ సినిమాలో కూడా ఫన్ జనరేట్ అవుతుందా లేక అవసరాలది ఎమోషనల్ ట్రాక్ లా ఉంటుందా అనేది చూడాలి. ఓవరాల్ గా ట్రైలర్ లో మంచి ఫీల్ ఉంది, మ్యూజిక్ లో కూడా మంచి సోల్ ఉంది. డైలాగ్స్ ని కథకి తగ్గట్లు రాసారు.

Exit mobile version