Site icon NTV Telugu

Ram Pothineni On The Warriorr : మా నిర్మాతలు నిజమైన ‘వారియర్స్’: సక్సెస్ మీట్‌లో రామ్

The Warriorr Success Meet

The Warriorr Success Meet

Ram Pothineni On The Warrior తన సినిమా ‘ది వారియర్’ నిర్మాతలు నిజంగా వారియర్స్ అంటూ కితాబిచ్చారు హీరో రామ్. రామ్, కృతి శెట్టి జంటగా ఆది పినిశెట్టి ముఖ్య పాత్రలో లింగుస్వామి దర్శకత్వంలో రూపొందిన ‘ద వారియర్’ ఈ నెల 14 విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం సక్సెస్ మీట్ నిర్వహించారు. అందులో రామ్ మాట్లాడుతూ ‘రిలీజ్ సమయంలో ఫుల్ వర్షాలు ఉన్నాయి. పలు అడ్డంకులు వచ్చాయి. అయితే మా నిర్మాతలు వారియర్స్‌లా నిలబడి రిలీజ్ చేశారు. నా నెక్స్ట్ సినిమా కూడా ఇదే నిర్మాతలకు చేస్తున్నాను. కొవిడ్ వచ్చినా, వర్షాలు వచ్చినా, ఏం వచ్చినా థియేటర్లకు వచ్చి తెలుగు ప్రేక్షకులు సినిమా లవర్స్ అని నిరూపించారు. ఇక దర్శకుడు లింగుస్వామి దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. ఈ సినిమాతో కృతి అందరికీ బేబీ అయిపోయింది. ఆది పినిశెట్టి ప్రాణం పెట్టి సినిమా చేశారు. తమిళులు చెబుతున్నట్లు ఈ సినిమాలో పాది ఆయనదే’ అని అన్నారు. తన తొలి తెలుగు సినిమాను చక్కగా రిసీవ్ చేసుకున్నందుకు థ్యాంక్స్ చెబుతూ ‘పందెం కోడి’, ‘ఆవారా’, ‘రన్’ సినిమాల్లాగా ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు లింగుస్వామి. ‘డాక్టర్లలో క్యూట్ నెస్, పోలీస్ లోని పర్ఫెక్షన్ రెండూ బాగా క్యారీ చేశారు రామ్. గురు పాత్రలో ఆది పినిశెట్టిని తప్ప ఇంకొకరిని ఊహించలేం. ఈ సంస్థలో మరో సినిమా చేసే అవకాశం వచ్చింది. ఐయామ్ సో హ్యాపీ’ అని కృతిశెట్టి అంటోంది. ఆది పినిశెట్టి మాట్లాడుతూ ‘గురు పాత్ర గురించి అందరూ మాట్లాడుతున్నారంటే దానికి కారణం గురు లింగుస్వామి. కమర్షియల్ సినిమాలకు ఆయన ల్యాండ్ మార్క్. బ్రదర్ రామ్, కృతి అందరితో నటించడం అద్బుతమైన అనుభం’ అని చెప్పారు. ఈ సక్సెస్ మీట్‌లో నిర్మాత శ్రీనివాసా చిట్టూరి, చిత్ర సమర్పకులు పవన్ కుమార్, ఫైట్ మాస్టర్ విజయ్, కళా దర్శకుడు డి. సత్యనారాయణ కూడా పాల్గొన్నారు.

Exit mobile version