Site icon NTV Telugu

OTT : ఆశ్చర్యపరుస్తున్న తమిళ సినిమాల ఓటీటీ డీల్స్

Kollywood (2)

Kollywood (2)

కమల్ హాసన్- మణిరత్నం కాంబోలో వస్తోన్న గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా థగ్ లైఫ్‌పై భారీ హైప్,హోప్ ఉన్నాయి కోలీవుడ్ సినీ సర్కిల్లో. ఎన్నో ఏళ్ల తర్వాత లెజండరీ యాక్టర్ అండ్ డైరెక్టర్ కొలబ్రేట్ కావడంతో పాటు రిలీజ్ చేసిన టీజర్ ఎక్స్ పర్టేషన్స్ ఎవరెస్ట్ తాకుతున్నాయి. జూన్ 5న రాబోతున్న ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఇప్పటికే సినిమా లెవల్లో సోల్డ్ అయ్యాయి. సుమారు రూ. 150 కోట్ల భారీ ఎమౌంట్ పెట్టి హక్కులు తీసేసుకుంది నెట్ ఫ్లిక్స్. ఇప్పటి వరకు కమల్ సినిమానే హయ్యెస్ట్ రేటుకు అమ్ముడై రికార్డ్స్ సృష్టించింది.

Also Read .Ram Charan : డైరెక్టర్ ‘బుచ్చిబాబు’కు చరణ్ దంపతుల స్పెషల్ గిఫ్ట్..

ఫేడటవుతున్నారు అనుకున్న టైంలో జైలర్‌ కంబ్యాక్ హిట్టుతో తనేంటో ఫ్రూవ్ చేసుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ఆ తర్వాత సినిమాలు దెబ్బేశాయి. కానీ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రాబోతున్న కూలీ మళ్లీ రజనీ ట్రాక్ ఎక్కిస్తుందన్న నమ్మకం తమిళ తంబీలకుంది. భారీ స్టార్ కాస్ట్ కూడా కూలీపై విపరీతమైన క్రేజ్,బజ్‌ను క్రియేట్ చేస్తోంది. దీన్నే భారీగా క్యాష్ చేసుకుంది సన్ పిక్చర్స్. సుమారు రూ. 110 నుండి 120 కోట్లకు ఓటీటీ రైట్స్ అమ్మిందని టాక్. జైలర్ 2 హక్కులు కూడా ప్రైమ్‌కే కట్టబెట్టనుంది నిర్మాణ సంస్థ. ఇవే కాదు ఈ ఏడాదే రిలీజయ్యే ఛాన్సులున్న సూర్య 45, కార్తీ సర్దార్ 2, వా వాతియార్, ధనుష్ ఇడ్లీ కడాయ్, రజనీ కాంత్ జైలర్ 2, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఏస్, ట్రైన్, నయా సెన్సేషనల్ హీరోగా మారిన ప్రదీప్ రంగనాథ్‌ అప్ కమింగ్ లవ్ ఇన్స్యురెన్స్ కంపెనీ చిత్రాలు కూడా భారీ ధరలకు ఓటీటీ రైట్స్ పలికే అవకాశాలున్నాయి.

Exit mobile version