Site icon NTV Telugu

OTT : ‘అంటే సుందరానికి’ ఓటీటీ ఫిక్స్

New Project (3)

New Project (3)

నాని హీరోగా నటించిన ‘అంటే సుందరానికి’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ఫిక్స్ అయింది. ఓటీలీలో రిలీజ్ ఎప్పుడన్నది ప్రకటించకపోయినప్పటికీ ప్లాట్ ఫామ్ మాత్రం ఫిక్సయింది. ఈ సినిమా శుక్రవారం నుంచి ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో ప్రదర్శితం కానుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో నజ్రియా హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా నిర్మాతల్లో ఒకరు తన ఇన్ స్టాలో ‘అంటే సుందరానికి’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కి ఇచ్చినట్లు ప్రకటిస్తూ ఓటిటి ప్లాట్‌ఫామ్ లో అంత త్వరగా విడుదల కాదు అని చెబుతూ థియేటర్లలోనే చూడాలని చెప్పటం విశేషం.

నిజానికి ఇటీవల కాలంలో టాప్ హీరోల సినిమాల నుంచి మీడియం రేంజ్ హీరోల వరకూ వారు నటించిన సినిమాలు రెండువారాలకే ఓటీటీలలో దర్శనం ఇస్తున్నాయి. ఆంతో సినిమా థియేటర్లలో ప్రేక్షకులు కరువయ్యారు. దీనిని దృష్టిలో పెట్టుకునే ‘అంటే సుందరానికి’ మూవీ రెండు నెలల వరకూ ఓటీటీలో విడుదల చేయవద్దని హీరో నాని కోరినట్లు వినిపిస్తోంది. అయితే ఓటీటీ రిలీజ్ అగ్రిమెంట్ ఎప్పుడో జరిగి ఉంటే మాత్రం నాని అభ్యర్థనకు అంత విలువ ఉండకపోవచ్చు. అలాగే సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి టాక్ తో హిట్ అయితే నాని సూచనను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. ఒక వేళ ఫట్ అయితే మాత్రం వెంటనే ఓటీటీలో దర్శనం ఇచ్చే ఆస్కారం ఉంది. చూడాలి ఏం జరుగుతుందో!?

Exit mobile version